ట్రోల్ చేసిన వారిపై అదిరిపోయే పంచ్ వేసిన అనసూయ!

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో సోషల్ మీడియా వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది.

అయితే చాలామంది నెటిజన్లు హీరోయిన్లు, యాంకర్లు, సెలబ్రిటీలు తమకు నచ్చినట్లుగా ఉండకపోతే ట్రోల్ చేస్తున్నారు.

కొందరు హీరోయిన్లు, యాంకర్లు ట్రోలింగ్ కు భయపడి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారంటే నెటిజన్లు ఏ స్థాయిలో వారిని హర్ట్ చేస్తున్నారో సులభంగానే అర్థమవుతుంది.ట్రోలింగ్స్ విషయంలో కొందరు హీరోయిన్లు, యాంకర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా కొందరు మాత్రం తమదైన శైలిలో ట్రోల్ చేసే వారిపై పంచ్ లు వేసి వార్తల్లో నిలుస్తున్నారు.

స్టార్ యాంకర్ తాజాగా మరోమారు ట్రోలర్స్ గురించి ఘాటుగా స్పందించారు.కోడి మెదడ్లు ఉన్నవాళ్లకు సమాధానాలు చెప్పలేమంటూ ట్రోలింగ్స్ పై అదిరిపోయే పంచ్ లు వేశారు.

గతంలో చాలా సార్లు ట్రోల్ చేసే వాళ్లపై అనసూయ మండిపడ్డ సంగతి తెలిసిందే.రెండు రోజుల క్రితం అనసూయ తన భర్త సుశాంక్ పుట్టినరోజును గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

Advertisement

తన భర్తపై ఉన్న ప్రేమ, ఆప్యాయత గురించి పోస్టులు పెడుతూ గోవాలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది.అనసూయ బ్యాక్ పిక్ ను షేర్ చేయగా ఆ పిక్ నెట్టింట వైరల్ కావడంతో పాటు ఆ ఫోటో గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అనసూయ పోస్ట్ లో హిందూ మహాసముద్రం దగ్గర ఉన్నానని పెట్టగా కొందరు అది హిందూ మహా సముద్రం కాదని కామెంట్లు చేశారు.ఆ కామెంట్లకు అనసూయ స్పందిస్తూ సగం మెదడు ఉన్నవాళ్లకు తానేం చెప్పలేనని.

ఉత్తర హిందూ మహాసముద్రంలోని ఒక ప్రాంతం అరేబియా సముద్రమంటూ పోస్ట్ చేసింది.నెటిజన్లు జ్ఞానాన్ని పెంచుకోవాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది.

అనసూయ కామెంట్ పై నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు