మరో మెగా హీరో సినిమాలో అనసూయ.. స్పెషల్ సాంగ్ కోసం!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.

బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయ వరుస సినిమా అవకాశాలను కూడా అందుకొని వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు.ఇప్పటికే ఎన్నో లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించడమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటించడం అలాగే ప్రత్యేక పాటలో నటించడం ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ తాజాగా మరో మెగా ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాని రీమేక్ చేస్తూ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఈమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని సమాచారం.ఈ సినిమాలో అనసూయ పాత్ర కథను మొత్తం కీలక మలుపు తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

Anasuya Making Special Song In Chiranjeevi Bhola Shankar Movie Details, Anasuya
Advertisement
Anasuya Making Special Song In Chiranjeevi Bhola Shankar Movie Details, Anasuya

ఇప్పటికే పుష్ప, ఖిలాడీ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ తాజాగా మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.ఇప్పటికే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అదే విధంగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించి నట్లు తెలుస్తోంది.

మొత్తానికి అనసూయ వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు