అవయవలోపాన్ని చూసి ఎక్కిరించిన వారి చేతనే శబాష్ అనిపించుకున్న అనంత శ్రీరామ్

దరిద్రం ఎంత కరుడుగట్టినదైనా కూడా మనలో టాలెంట్ ఉంటే ఎవ్వడు ఆపలేడు అనేది నగ్న సత్యం.అందుకు చక్కటి ఉదాహరణ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్.

తనకు 12 ఏళ్ల వయసు రాగానే తనలో ఒక పాటగాడు అన్న విషయాన్ని అనంత శ్రీరామ్ కనిపెట్టేశాడు.అందుకే ఎవరికీ తెలియని అనేక తెలుగు పదాలను కలిపి ఎంతో అద్భుతమైన పాటలను రాశాడు.

అతడు అచ్చ తెలుగు అనంతుడనే చెప్పాలి.జీవితం పట్ల ఒక చక్కటి క్లారిటీ ఉంటుంది అంతేకాదు తన మాటల్లో ఎంతో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది.40 ఏళ్ల వయసు వచ్చాక అతను ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేది కేవలం 18 ఏళ్ల వయసులోనే ఉండి పక్క ప్లానింగ్ చేసుకున్నటువంటి మేధావి అనంత శ్రీరామ్.జీవితం ఎలా ఉండాలో మనం ఎప్పుడూ ఊహించుకుంటూనే ఉంటాం.

దానికి సరిపడా ఎన్నో కలలు కూడా కంటాం.మన కలలని సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటాం.

Advertisement

కానీ మన ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన మన కలలకు ఎలాంటి అంతరాయం కలిగిన కూడా ఏదో ఒకచోట మన ప్రయాణాన్ని ఆపేస్తాం.ఇక ఎవరైనా మన ప్రయాణంలో మనల్ని అవమానిస్తే మాత్రం అస్సలు భరించలేం.

కానీ అనంత శ్రీరామ్ అలాంటి వ్యక్తి కాదు.అతడు పడిన అవమానాలు, ఆకలి, కష్టాలను తన అస్త్రాలుగా మార్చుకొని వాటిని ప్రయోగాలు చేశాడు.

అతడు ఒక పట్టు వదలని విక్రమార్కుడు.తన గమ్యాన్ని చేరడం కోసం ఎన్నో ముళ్ళ బాటలను సైతం లెక్కచేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

అందుకే ఇంజనీరింగ్ చదువు పూర్తికాకుండానే చివరి సంవత్సరంలోనే తనపై తనకున్న అత్యంత నమ్మకంతో ఒక సూట్ కేసు పట్టుకొని హైదరాబాద్ బయలుదేరాడు.అక్కడ జీవితం అసలు సత్యం బోధపడింది.ఆకలి బాధ తెలిసింది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

తన కష్టాన్ని,బాధని పెట్టుబడిగా పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.తన అవయవ లోపాన్ని వెక్కిరించిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు.

Advertisement

నిజానికి తనది కేవలం అవయవ లోపం మాత్రమే కానీ చాలామందికి బుద్ధి లోపం ఉంది అంటుంటాడు.అలాంటి వారిని ఎవరు మార్చలేరని తనను తానే చెక్కుకున్న శిల్పి అనంత శ్రీరామ్.

ఏదోలా మొదటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు ఆ ఒక్క అవకాశాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకున్నాడు.ఆ ఒక్క పాటే 100 పాటలను ఇచ్చింది.

అందుకే అతడు ఒక గొప్ప సంస్కారవంతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మన తెలుగుకు దొరకడం కళామ్మతల్లి చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

తాజా వార్తలు