కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు.

అరుపులు విని రక్షించిన యువకులు.తాళ్ళ సహాయంతో బావిలో నుండి పైకి లాగి రక్షించిన గ్రామస్థులు.

కోతుల బెడద నుండి రక్షించ మని వెడుకొంటున్న గ్రామస్థులు.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బోప్పాపూర్ గ్రామంలో కోతుల దాడిలో గంభీర్ పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు బావిలో పడింది.25 గజాల లోతు వున్న బావి మధ్యలో పడిన రాజవ్వ బావి మధ్యలో చిక్కుకుంది.తనను రక్షించమని బావిలో నుండి ఇంటి ప్రక్కనున్న ముస్లింల కుటుంబ సభ్యులను అరుస్తూ పిలిచింది.

ఒంటరిగా ఉంటున్న రాజవ్వ అరుపులు విన్న ముస్లిం లు పరుగున వచ్చి బావిలో పడ్డ రా జవ్వను గుర్తించారు.వెంటనే గ్రామంలోని ఆమె బంధువులకు,ప్రజా ప్రతినిధి దులకు సమాచారం అందించారు.

అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఆంధ్ర ప్రభ జర్నలిస్టు శ్రీనివాస్ రాజుకు వృద్ధురాలు బావిలో పడ్డ సమాచారం తెలిసింది.హుటాహుటిన ఆంధ్ర ప్రభ జర్నలిస్టు శ్రీనివాస్ రాజు ( Srinivas Raju ) వృద్ధురాలు రా జవ్వ ఇంటికి వెళ్ళి బావిలో పడ్డ వృద్ధురాలు కు ధైర్యం చెప్పాడు.

Advertisement

అప్పటికే అక్కడికి చేరుకున్న యువకులు బావిలోకి తాళ్ళను వదిలి రాజవ్వను తాల్లను పట్టుకోమని చెప్పి ఆమెకు ధైర్యం ఇచ్చారు.అప్పటికే వృద్ధురాలు బావిలో పడ్డ సమాచారం తెలుసుకున్న బందువులు,కులస్థులు,పరిసర ప్రజలు,యువకులు బావి వద్దకు చేరుకున్నారు.25 గజాల లోతు వున్న బావిలోకి పడకుండా వృద్ధురాలిని నీ బయటకు తీయడానికి గ్రామ యువకులు తీవ్రంగా శ్రమించారు.గ్రామానికి చెందిన యువ కుడు దైర్యంగా తాడు సహాయంతో బావిలోకి దిగి వృద్ధురాలు రాజ వ్వ నడుము కు త్రాడు ను కట్టాడు.

బావి పైనున్న బందువులు , యువకులు వృద్ధురాలు రజవ్వను పైకి లాగి రక్షించారు.బావి నుండి పైకి వచ్చిన వృద్ధురాలు బయందోల నకు గురి కావడంతో ఆమెను నీటితో శుభ్రం చేసిన గ్రామస్థులు ఆమె ప్రక్కనే వుండి దైర్యం చెప్పారు.

స్థానిక అర్ ఎంపి డాక్టర్ తో వృద్ధురాలు రాజవ్వకు వైద్య పరీక్షలు , చికిత్స చేయించారు.రాజవ్వ కు కూతురు వుండగా వివాహం అయి చేర్యాలలో వుంటుంది.

గ్రామంలోకూరగాయలు విక్రయిస్తూ జీవితము గడుపుతున్న రాజవ్వ భర్త గత ఏడాది మృతి చెందాడు.ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు ఇంటిలో వున్న జమా,మామిడి చెట్టుపై గుంపుగా చేరిన కోతులు ఇంట్లో నుండి బయటకు వచ్చిన రజవ్వ పై దాడికి దిగడం తో భయం తో పరుగెత్తిన వృద్ధురాలు బావిలో పడింది .ఆమె అరుపులు విన్న చుట్టూ ప్రక్కల వారు సకాలంలో చేరుకొని రాజవ్వను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.కాగా గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారడంతో ప్రజల కు ప్రాణాపాయ పరిస్తి తులు ఏర్పడుతున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

గత వారం క్రితం గ్రామంలోని బి సి కాలనీలో నీ తడుక రాజేంద్ర ప్రసాద్ )( Rajendra Prasad అనే నిరుద్యోగి గురుకుల,ఉపాధ్యాయ ఉద్యగాలకు ప్రిపేర్ అవుతూ ఈ నెల 5,12,13 తేదీల్లో పరీక్షకు హాజరు కానుండటంతో ఆయనపై కోతులు దాడి చేయడంతో తప్పించుకొనే ప్రయత్నంలో అయన ఎడమ కాలు, కుడి చేయి విరిగి మంచం పై పడ్డాడు.దీంతో మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్ సలహాతో మంచానికే పరిమితం అయిన రాజేంద్ర ప్రసాద్ ఎడాదిగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న తరుణంలో కోతుల దాడితో ఆయన ఉపాధ్యాయ పరీక్షకు దూరం అయ్యాడు.

Advertisement

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని కలలు కన్న రాజేంద్ర ప్రసాద్ ఆశలు పరీక్షలకు హాజరు కాలేనీ పరిస్థితి తో అడియాషలు అయ్యాయి.గ్రామంలో తీవ్ర మయిన కోతుల బాధతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ వున్నారు.

ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు కల్పిస్తున్న కోతులనుండి రక్షించాలని గ్రామ సర్పంచ్ ను,పాలక వర్గాన్ని,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Latest Rajanna Sircilla News