బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలు గొప్పేమీ కాదు: అమితాబ్

ఒకప్పుడు ఇండియన్ సినిమా( Indian Cinima ) అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అని చెప్పుకునే వారు.అంతలా బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి.

అయితే ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ సినిమాల హవా తగిందని ఇండియన్ సినిమాని సౌత్ ఇండస్ట్రీ ( South Industry ) శాసిస్తోందని పలువురు భావిస్తున్నారు.ఈ విధంగా సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ( Bolly wood ) సౌత్ ఇండస్ట్రీ అనే భాషా బేధం కూడా తెరపైకి వచ్చింది.ఈ క్రమంలో బాలీవుడ్ పని అయిపోయింది, సౌత్ ఇండియా చిత్రాలు డామినేట్ చేస్తున్నాయనే వాదన మొదలైంది.

ఈ అభిప్రాయాన్ని లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ( Amithab Bachchan )ఖండించారు.

Advertisement

ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్( Amithab Bachchan ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సౌత్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కొందరు అంటున్నారు.నిజానికి ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల సినిమాలకు కథలుగా, స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఈ మధ్య ప్రాంతీయ భాషా చిత్రాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అద్భుతమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మీ సినిమా చాలా బాగుందని సౌత్ వారి దగ్గర చెబితే కనుక బాలీవుడ్ సినిమాలను చూసే తాము ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నామని సమాధానం చెబుతున్నారు అంటూ అమితాబ్ తెలిపారు.మలయాళ, తమిళ సినిమాలు వాటికవే ప్రత్యేకం.అలాగని బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ గొప్పని చెప్పడం సరికాదని ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి సౌత్ చిత్ర పరిశ్రమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు