సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీపై అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ ముగిసింది.

ఈ సమావేశంలో ప్రధానంగా నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ పై అమిత్ షా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు.పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడటం కానీ, లీకులు ఇవ్వడం కానీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరించారు.

ఎంపీ టికెట్ ఆశావాహులు, వారి బలాబలాలపైనా అమిత్ షా ఆరా తీశారని సమాచారం.అలాగే సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు