మోత్కూరులో సిపిఎం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా:దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలు చేసి, విద్వేషాలకు కారణమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో సోమవారం అమిత్ షా వాఖ్యాలను ఖండిస్తూ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్,గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య,సహాయ కార్యదర్శి కొంపల్లి గంగయ్య,చింతకింది సోమరాజు,వడ్డేపల్లి లక్ష్మణ్,వెండి యాదగిరి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

మిర్యాలగూడలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఎమ్మేల్యే...!

Latest Yadadri Bhuvanagiri News