యూఎస్ కంటే ఇండియా బెస్ట్.. ఢిల్లీలో జీవితం అద్భుతం.. అమెరికన్ కామెంట్స్ వైరల్..?

చాలామంది భారతీయులు అమెరికాలో( America ) జీవితం బాగుంటుందని ఆదేశాన్ని తరలిపోతున్నారు కానీ అక్కడ జీవితం పెద్దగా బాగుండదని అమెరికాలో చెబుతున్నారు వారు ఇండియాకి వచ్చి మరీ సెటిల్ అవుతున్నారు.

జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి ఇండియాకు( India ) మించిన ప్రదేశం ఏదీ లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే క్రిస్టెన్ ఫిషర్( Kristen Fischer ) అనే అమెరికన్ మహిళ కూడా యూఎస్ కంటే ఇండియా బెస్ట్ అని పేర్కొన్నది.ఆమె తన భర్తతో కలిసి 2017లో భారతదేశం వచ్చింది.

ఆ తర్వాత రెండేళ్లు ఢిల్లీలో( Delhi ) నివసించింది.అమెరికా కంటే భారతదేశం చాలా అద్భుతమైనదని ఆమె రీసెంట్‌గా కామెంట్స్ చేసింది.

అమెరికా చాలా స్వార్థపూరితమైన దేశమని, ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉంటారని క్రిస్టెన్ ఫిషర్ అంటుంది.భారతదేశంలో ఉన్నట్లుగా అక్కడ మంచి సమాజం, సంస్కృతి లేవని చెప్పింది.

Advertisement

"డబ్బు కంటే జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి" అని కూడా ఆమె చెప్పింది.భారతదేశంలో నివసించడం వల్ల అమెరికాలో లేని ఆనందం, తృప్తి లభించిందని చెప్పింది.

క్రిస్టెన్ ఫిషర్ తాను ఎందుకు అమెరికా వదిలి భారతదేశంలో ఉంటున్నానో ఒక వీడియోలో వివరించింది.ఆమె మాట్లాడుతూ, "ప్రజలు ఎప్పుడూ నన్ను అడుగుతారు, నేను అమెరికా వదిలి భారతదేశానికి ఎందుకు వెళ్ళాను? అని.చాలా మంది భారతదేశం అమెరికా కంటే దిగజారిపోయిందని అనుకుంటారు, కానీ నా అభిప్రాయం మరోలా ఉంది." అని వీడియో ప్రారంభించింది.

ఆ వీడియోలో ఆమె "మీరు భారతదేశంలో ఉండి అమెరికా జీవితం చాలా మంచిదని అనుకుంటే నేను అర్థం చేసుకుంటాను.చాలామంది నేను అమెరికా ఎందుకు వదిలి భారతదేశానికి వచ్చానో అడుగుతారు, నేను వివరిస్తాను.

నేను అమెరికాను ప్రేమిస్తున్నాను, కానీ అది పర్ఫెక్ట్ కాదు.అది చాలా స్వార్థపూరితమైనది సమాజం.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

ఇక్కడి ప్రజలు అస్సలు ఫ్రెండ్లీగా ఉండరు.ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా తక్కువే.

Advertisement

భారతదేశంలో మాత్రం జీవితం, సంస్కృతి, సమాజం ఉంది.ప్రజలు దయగలవారు, ఒకరికొకరు సహాయపడతారు.

నా పిల్లల భవిష్యత్తు భారతదేశంలో మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను." అని చెప్పింది.

క్రిస్టెన్ ఫిషర్ ఇంకా మాట్లాడుతూ "భారతదేశంలో మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.చుట్టూ ఎల్లప్పుడూ ప్రజలు ఉంటారు.అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు( Indians ) ఒంటరిగా, బాధను అనుభవిస్తారు.

అమెరికాలో ఎక్కువ సంపాదించవచ్చు, కానీ డబ్బు( Money ) మాత్రమే మీ లక్ష్యమైతే, అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.నేను జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని నమ్ముతున్నాను, భారతదేశం ఆనందం, తృప్తి, కుటుంబాన్ని పెంచడానికి మంచి చోటు.

" అని వీడియో ముగించింది.ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకున్నారు.

కొంతమంది క్రిస్టెన్ ఫిషర్ అభిప్రాయానికి అంగీకరించారు, మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.ఒకరు, "అమెరికాలో డబ్బు సంపాదించడం అంత సులభం కాదు, జీవన వ్యయం చాలా ఎక్కువ" అని అన్నారు.

మరొకరు, " భారతదేశంలో ఉండటమే నాకు చాలా ఆరోగ్యంగా అనిపించింది.తిరిగి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను" అని అన్నారు.

మరికొందరు, పిల్లలు అమెరికాలో స్థిరపడితే తిరిగి వెళ్లడం ఎంత కష్టమో గమనించారు.

తాజా వార్తలు