ఏపీ ప్రభుత్వానికి విరాళం అందచేసిన అమెరికా తెలుగు అసోసియేషన్.. !

చేయి చేయి కలిస్తే ఒక దండులా మారుతుందంటారు పెద్దలు.

అలాగే దేశాన్ని కరోనా కబళించి ప్రజల ప్రాణాలను ఆకలిగొన్న పులిలా ఆరగిస్తుంటే ఎన్నో కుటుంబాలు దిక్కులేని అనాధలుగా మిగిలి ఆర్తనాదాలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యం లో దేశానికే కాదు, రాష్ట్రాలకు కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి.ప్రపంచ దేశాలే కాదు, వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తమ రుణాన్ని ఏదో ఒక రూపంలో తీర్చుకుంటున్నారు.

ATA Donates Oxygen Concentrators To AP Covid Patients, American, Telugu Associat

కరోనా మహమ్మారి మిగుల్చుతున్న విషాదానికి ఊరటగా ఏదో ఒక రూపేనా సహాయం అందిస్తున్నారు.ఇకపోతే ఏపీ ప్రభుత్వానికి అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) విరాళంగా ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను అందించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 600 కాన్సట్రేటర్స్ పంపిణీ చేయనుండగా ప్రస్తుతం 50 కాన్సట్రేటర్స్ ను ఆటా ప్రభుత్వానికి అందించింది.ఇక ఈ విరాళాన్ని ఆటా ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు