భారతీయుడు ఆచూకీ చెప్తే రెండు కోట్లు ఇస్తాం అంటున్న అమెరికా..!

తాజాగా అమెరికాలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ పరారీలో ఉన్న ఓ భారతీయుడు ఆచూకీ తెలిపితే 2.1 కోట్ల రివార్డును ఇస్తామని తెలిపింది.

ఎఫ్బిఐ ఇచ్చిన సమాచారం మేరకు గుజరాత్‌( Gujarat )కు చెందిన భద్రేశ్‌ కుమార్ చేతన్ భాయ్ పటేల్( Bhadreshkumar Patel ) 2015 లో తన భార్యను హత్య చేసి అప్పటి నుండి అతడు పరారీలో ఉన్నాడు.

ఇక అతడి నేరల చిట్టా చూస్తే.ఆ తీవ్రత దృష్ట్యా టాప్ 10 నేరస్తుల జాబితాలో ఆయనన చేర్చినట్టు ఎఫ్‌బీఐ తెలిపింది.

అమెరికాలోని మేరీల్యాండ్‌ లోని వాంకూవర్‌ లో బార్యాభర్తలు పనిచేస్తున్న ఓ రెస్టారెంట్‌ లోనే భద్రేశ్‌కుమార్ ఏప్రిల్ 12 20215 న తన భార్యను హత్య చేసినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది.వారు పనిచేస్తున్న రెస్టారెంట్ వెనకవైపు అతడు కత్తితో తన భార్యను అతి దారుణంగా పొడిచి చంపేశాడు.ఇక ఈ హత్య నైట్ షిఫ్ట్ సమయంలో జరిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.

ప్రస్తుతం అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ మర్డర్ సంబంధించి నిందితుడిపై అరెస్ట్ ఇష్యు వారెంట్ జారీ అవ్వడంతో అతడు కనిపించకుండా పోయాడు.

Advertisement

ఇక భద్రేశ్‌ కుమార్ చేతన్ భాయ్ పటేల్ ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు నిరంతరంగా శ్రమిస్తునట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు.అయితే ఒకవేళ స్థానికులు నుంచి సమాచారం వస్తే కనుక మాత్రం అతి త్వరలో నిందితుడి ఆచూకీ పట్టుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు పోలీసులు.ఇక నిందితుడిని అరెస్టు చేసి, తగిన శిక్ష పడేలా చేసేంతవరకూ తాము విశ్రమించబోమని అధికారులు స్పష్టం చేశారు.

మణిపూర్ లో భూకంపం..!!
Advertisement

తాజా వార్తలు