అమెరికా, చైనా మధ్య చిప్ వార్.. భారత్‌కు మరింత లాభం

దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఆర్ధిక విషయాల్లో వివాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి.దీని వల్ల దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి.

ఒక దేశం మరో దేశం నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉంటుంది.ఆ దేశంలో ఎక్కువగా లభించే వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.

ఇక ఒక దేశం మరో దేశానికి తమ దేశంలోనే వస్తువులను ఎగుమతి చేస్తూ ఉంటుంది.ఇలా వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేయడం వల్ల ఆర్ధికంగా కూడా లాభం ఉంటుంది.

అయితే ఆర్ధిక విషయాల్లో దేశాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది.ప్రతి దేశం ఇతర దేశాల కంటే అభివృద్ధిలో దూసుకుపోవాలని, అగ్రగామిగా నిలవాలని తాపత్రయపడుతూ ఉంటుంది.ఈ క్రమంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా,( America ) చైనా ( China ) మధ్య ఇలాంటి పోటీనే నెలకొంది.

Advertisement

ఆ రెండు దేశాల మధ్య చిప్ వార్ నడుస్తోంది.ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు లేదా సెల్‌ఫోన్ పనిచేయాలంటే సెమీ కండక్టర్ చిప్‌ల( Semi Conductor Chip ) అవసరం ఉంటుంది.

ఇవి లేకుండా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు.ప్రస్తుతం తైవాన్( Taiwan ) దేశం 80 శాతం వరకు ఈ చిప్‌లను తయారుచేస్తోంది.

అయితే తైవాన్‌ను తమ దేశంలో కలిపేసుకుంటామని చైనా చెబుతోంది.ఇదే జరిగితే సెమీ కండక్టర్ల ఎగుమతిని చైనా ఆపేస్తే చాలా దేశాలకు నష్టం చేకూరే అవకాశముంటుంది.దీంతో అమెరికా దీనిని పసిగట్టి సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

భారత్ లో ( India ) ఎక్కువగా అమెరికా కంపెనీలు పెట్టబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అమెరికా పర్యటన వెళ్లగా.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఈ సమయంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి.దీంతో భవిష్యత్తులో సెమీ కండక్టర్ చిప్‌ల తయారీకి భారత్ హాబ్‌గా మారనుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు