అఫీషియల్: జైలర్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న ప్రముఖ సంస్థ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Deelipkumar)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన తాజా చిత్రం జైలర్( Jailer ) .

ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, శివ రాజ్ కుమార్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఇక ఆగస్టు 10వ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఆగస్టు 10వ తేదీ విడుదల అయ్యి ఇప్పటివరకు 600 కోట్లకు పైగా కలెక్షన్లు( Jailer Movie Collections ) రాబట్టడంతో దర్శక నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూశారు.అయితే మొదట్లో ఈ సినిమా సన్ నెక్స్ట్ లో రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.అలాగే హిందీ వర్షన్ మాత్రమే అమెజాన్ లో వస్తుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు అన్నింటిని కొట్టి పారేస్తూ ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా అన్ని విషయాలను వెల్లడించారు.ఈ సినిమా అన్ని భాషలలో డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే తెలుగు తమిళ హిందీ మలయాళ అన్ని భాషలలోనూ ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.ఇక ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడమే కాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండబోతుందని తెలియజేశారు.ఇలా ఆగస్టు 10వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతుండడంతో ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిన వారందరూ కూడా అమెజాన్లో చూడటం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు