అమెజాన్ ప్రైమ్ కి దొరికిన మహర్షి! దిల్ రాజుకి భాగా గిట్టుబాటు అయ్యిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మహర్షి.

ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని మహేష్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

దిల్ రాజు అంచనా ప్రకారం ఈ సినిమాకి 130 కోట్లకి పైగానే అయినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఈ సినిమా బిజినెస్ ఆశించిన అవ్వలేదని, టేబుల్ లాస్ తో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైం భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు మహేష్ కెరియర్ లో ఏ సినిమాకి పెట్టని స్థాయిలో ఈ సినిమా కోసం అమెజాన్ సంస్థ పెట్టుబడి పెట్టిందని.ఏకంగా 11 కోట్లు డిజిటల్ రైట్స్ కోసం ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక డిజిటల్ రైట్స్ రూపంలో రిలీజ్ కి ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్ రావడం నిజంగా విశేషం.మరి ఊపిరి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దర్శకుడు వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ సినిమా మహేష్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు