అలసందలతో అదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంతకీ వీటిని ఎలా తింటే మంచిది..?

అల‌సంద‌లు.పేరు వినే ఉంటారు.

కానీ మ‌న‌లో చాలా మంది వీటిని క‌నీసం టేస్ట్ కూడా చేసుండ‌రు.

నవ ధాన్యాల్లో అల‌సంద‌లు ఒక‌టి.

వీటిని బ్లాక్-ఐడ్ పీస్ లేదా కౌపీస్ అని కూడా పిలుస్తారు.అల‌సంద‌ల్లో ఫైబర్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఐర‌న్, కాప‌ర్‌, ఫోలేట్, జింక్‌, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలకు ఇవి గొప్ప మూలం.అందువ‌ల్ల అల‌సంద‌ల‌తో అదిరే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Amazing Health Benefits Of Eating Black-eyed Peas! Black-eyed Peas, Black-eyed P

వెయిట్ లాస్(Weight loss) అవ్వాల‌ని భావిస్తున్న వారికి అల‌సంద‌లు ఒక సూప‌ర్ ఫుడ్‌గా చెప్ప‌బ‌డ్డాయి.అల‌సంద‌ల్లో(black eyed) ప్రోటీన్ మరియు కరిగే ఫైబర్ అధికంగా ఉంటాయి.

ప్రోటీన్ మీకు ఆకలిగా అనిపించే గ్రెలిన్ అనే హార్మోన్‌ను తగ్గిస్తుంది.కరిగే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదించ‌డ‌మే కాకుండా ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపును నిండుగా ఉంచుతుంది.

దాంతో తిన‌డం త‌గ్గిస్తారు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

Amazing Health Benefits Of Eating Black-eyed Peas Black-eyed Peas, Black-eyed P

అలాగే అల‌సంద‌ల్లో ఫోలేట్(విటమిన్ బి9) (Folate (Vitamin B9))అధికంగా ఉంటుంది.ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు నిర్వహణలో సహాయపడుతుంది.గర్భిణీ స్త్రీలు మరియు గర్భం పొందాలనుకునే వారికి ఈ విటమిన్ చాలా అవ‌స‌రం.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

కాబ‌ట్టి వారు అల‌సంద‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు.అల‌సంద‌లు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండ‌టం కార‌ణంగా మ‌ధుమేహులు కూడా వీటిని తినొచ్చు.

Advertisement

అల‌సంద‌ల్లోని డైటరీ ఫైబర్ మరియు ప్రోటీన్ రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి.

అల‌సంద‌ల్లో ఐరన్ పుష్కలంగా ఉండ‌టం వ‌ల్ల ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు ఇవి తోడ్ప‌డ‌తాయి.అంతేకాకుండా అల‌సంద‌ల్లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్ కణాల విస్తరణ, కణితి అభివృద్ధి మరియు ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారించగలవు.అల‌సంద‌ల్లో పొటాషియం మెండుగా ఉంటుంది, ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

ఇక అల‌సంద‌ల‌ను ఉడికించి లేదా స్ట్రీమ్ చేసి తీసుకుంటే చాలా మంచిది.అల‌సంద‌లతో వ‌డ‌లు వేసుకోవ‌చ్చు.సలాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు.

మరియు క‌ర్రీగా వండుకుని కూడా తినొచ్చు.

తాజా వార్తలు