వాముతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మన దేశంలో వాము( Ajwain ) దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటుంది.

అలాగే ఈ వాము లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వాముని 10 గ్రాములు గిన్నెలోకి తీసుకొని అందులో 60 ml నీటిని తీసుకొని బాగా మరిగించి, ప్రతి రెండు గంటలకు ఒకసారి 15 ఎంఎల్ చొప్పున తీసుకుంటే నీళ్ల విరోచనాలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వాముని దోరగా వేయించి దానికి కాస్త ఉప్పుని చేర్చి బాగా నూరి ప్రతిరోజు చిన్న పిల్లలకు ఆహారంతో పాటు కొంచెం వాము మిశ్రమాన్ని తినిపిస్తే పిల్లలకు అజీర్తి తగ్గిన జీర్ణ వ్యవస్థ( Digestion ) పనితీరు మెరుగుపడుతుంది.

ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకు వచ్చే కడుపు ఉబ్బరం మరియు కడుపు నొప్పులకు ఒక చెంచా వాము తీసుకొని చిటికెడు సొంటిపొడి, చిటికెడు దుంప రాసి చూర్ణన్ని, ఈ మూడింటిని నీళ్లలో పోసి మరిగించి ఇస్తే కడుపు ఉబ్బరం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.వాము పొడిని రోజుకు రెండు గ్రాముల చొప్పున బెల్లం( Jaggery )తో కలిపి నమిలి మింగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా ఒక వారం రోజుల పాటు పత్యం చేస్తే ఎలర్జీలకు సంబంధించి వచ్చే దద్దుర్లను కూడా నివారించవచ్చు.

Advertisement

ఇంకా చెప్పాలంటే చిగుళ్ల వాపు( Gingivities )కు వాము కలకండని నోట్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉంటే చిగుళ్ల వాపును దూరం చేసుకోవచ్చు.అలాగే రోజుకు రెండు చెంచాల వాము పొడిని భోజననికి ముందు నీటితో తాగితే రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ శాతం( Blood Cholesterol ) 7 రోజుల్లోనే తగ్గిపోతుంది.ప్రతిరోజు వాము పొడిని తీసుకుంటే అధికము కొవ్వు వల్ల వచ్చే గుండె నొప్పి మరియు పక్షపాతం వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా దూరం అవుతాయి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు