అరటిపండు తొక్కతో ఇన్ని లాభాలా !

అరటిపండు చాలా ఆరోగ్యకరమైన ఫలం.పైగా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

అందుకేనేమో పెద్దగా పట్టించుకోరు.

ఇక అరటిపండు తొక్కనైతే అసలే పట్టించుకోరు.

ఇలా తినగానే అలా పడేస్తారు.కాని అరటితొక్కతో ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఖర్చులు పెద్దగా పెట్టకుండా, ఎన్నోరకాలుగా వాడుకోవచ్చు అరటితోక్కని.వాటిలో కొన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

* దంతాలు పచ్చగా ఉంటే, రోజూ అరటిరోక్కతో రుద్దుతూ ఉండండి.మంచి ఫలితాలు కనిపిస్తాయి.

* ముఖం మీద వచ్చే ముడతలు, కళ్ళ కింద ఏర్పడే వలయాలు పోగొట్టుకోవాలంటే అరటితొక్క మంచి మార్గం.* జిడ్డు చర్మానికి అరటితొక్క మంచి ఉపశమనం.

రోజు అరటితోక్కను ముఖానికి రుద్దుకోవడం అలవాటు చేసుకోండి.అరటితొక్క జిడ్డుని బాగా తొలగిస్తుంది.

* మొటిమలకు అరటితొక్క పెద్ద శత్రువు.తొక్కే కదా అని తీసిపారేయకండి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

అరటితొక్క అంటే భయపడతాయి మొటిమలు.* అరటితొక్క వాడితే , ఏ ఫేర్ నెస్ క్రీమ్ వాడాల్సిన అవసరం లేదు.

Advertisement

ముఖం రంగు తేలాలంటే, అరటితొక్క వాడకం సహజమైన ఉపాయం.

* చెప్పులు, షూలను పాలిష్ చేసుకోవడానికి కూడా అరటితోక్కను వాడుకోవచ్చు.* గాయం తగిలిన చోట అరటితొక్క రాస్తే, నొప్పి చాలావరకు తగ్గుతుంది.ఇదంతా చదివారు కాబట్టి, అరటిపండు తిని, అరటితోక్కను కూడా వాడుకున్నాకే చెత్తబుట్టలో పడేయ్యండి.

తాజా వార్తలు