'బిగ్ బాస్' టైటిల్ విన్నింగ్ రేస్ లో అమర్ దీప్ మరియు ప్రశాంత్..దరిదాపుల్లో లేని శివాజీ!

ఈ సీజన్ బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఎంత రసపట్టుగా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ఆడియన్స్ కి వినోదం పంచడం లో ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో ది బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం శివాజీ, అమర్ దీప్( Shivaji, Amar Deep ) మరియు ప్రశాంత్( Prashanth ).వీళ్ళ తర్వాత యావర్, రతికా మరియు టేస్టీ తేజా.వీళ్లంతా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి బోలెడంత కంటెంట్ ఇచ్చారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.వీరిలో ఒకరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు.

మరొకరి వచ్చే వారం మధ్యలో ఎలిమినేట్ అవ్వబోతున్నారు.టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడే చెప్పలేం కానీ, టాప్ 3 లో మాత్రం శివాజీ, అమర్ మరియు ప్రశాంత్ నిలుస్తారు.

Advertisement

వీరిలో ప్రధానం గా అమర్ దీప్ మరియు ప్రశాంత్ మధ్యనే టైటిల్ పోరు నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంది.యూట్యూబ్ లో నిర్వహించే పోల్స్ లో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానం లో కొనసాగుతుండగా, అమర్ దీప్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.1 మిలియన్ పోల్ అయినా ఓట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం అమర్ దీప్ నెంబర్ 1 స్థానం లో ఉండగా, పల్లవి ప్రశాంత్ రెండవ స్థానం లో ఉన్నాడు.

ఇలా రెండు పెద్ద సోషల్ మీడియా మాధ్యమాలలో ఇరువురి స్థానాలు ఇలా ఉన్నాయి.కానీ శివాజీ మాత్రం వీళ్ళిద్దరికంటే చాలా తక్కువ ఓట్లతో మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు.

కానీ శివాజీ ని తక్కువ అంచనా మాత్రం వెయ్యలేము, ఎందుకంటే ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు మెండుగా ఉంది, ఇంటికి మూడు ఓట్లు పడినా టైటిల్ కొట్టేస్తాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ రెండు స్పై మరియు స్పా ( Spy and Spa )అని రెండు గ్రూప్స్ గా విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.స్పై గ్రూప్ నుండి అత్యధిక ఓట్లతో కొనసాగుతున్నది ప్రశాంత్ కాబట్టి, ఆ గ్రూప్ ని అభిమానించే వాళ్ళందరూ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ని పక్కన పెట్టి ప్రశాంత్ కి ఓట్లు వేస్తున్నారు.మరో పక్క స్పా గ్రూప్ లో అమర్ దీప్ కి పడే రేంజ్ ఓట్లలో పావు శాతం కూడా ప్రియాంక మరియు శోభా శెట్టి కి పడదు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

అమర్ కి మరియు వాళ్ళిద్దరికీ మధ్య అంత ఫ్యాన్ బేస్ తేడా ఉంది.కానీ అమర్ కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ప్రియాంక మరియు శోభా ని ఇష్టపడే వాళ్ళు కూడా అమర్ కి ఓట్లు వేస్తున్నారు.

Advertisement

కాబట్టి చివరికి ఎవరు టైటిల్ గెలుస్తారు అనేది ప్రస్తుతానికి ఎంతో ఆసక్తికరం గా మారింది.టైటిల్ గెలుచుకొని 50 లక్షల ప్రైజ్ మనీ కొట్టే ఛాన్స్ కేవలం అమర్ మరియు ప్రశాంత్ కి మాత్రమే ఉందని తెలిసిపోయింది.

తాజా వార్తలు