అల్మాస్ పూర్ బీజేపీ నూతన గ్రామశాఖ కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో బీజేపీ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నాయకులు తెలిపారు.

గ్రామశాఖ నూతన అధ్యక్షుడిగా ఉత్తమ్ సాయి, ఉపాధ్యక్షులుగా నక్క కిషన్, ఎండి మదర్, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శిగా పందిర్ల శ్రీకాంత్ గౌడ్ లను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

నూతన కమిటీ ఎన్నిక అనంతరం మండల ఉపాధ్యక్షులు సింగరేణి కృష్ణహరి మాట్లాడుతూ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని నూతన కమిటీకి సూచించారు.అలాగే రానున్న ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని బీజేపీ సీనియర్ ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత..
Advertisement

Latest Rajanna Sircilla News