ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా తన సత్తా చూపించుకునే ప్రయత్నంలో ఉంది.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజల నుంచి ఎంత వరకు మద్దతు లభిస్తుంది అనేది మరో పది రోజుల్లో తేలిపోతుంది.
అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జనసేన వెంట మెగా హీరోలు ఎంత వరకు నిలబడతారు అనే చర్చ నడుస్తూ వచ్చింది.

ఈ నేపధ్యంలో జనసేన పార్టీ తరుపున నాగబాబు నర్సాపురం ఎంపీగా బరిలోకి దుగుతున్న వేళ ఇక మెగా ఫ్యామిలీ కూడా జనసేనకి పవన్, నాగబాబుకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి వస్తారని అందరూ భావించారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే మెగా హీరోయిన్ నిహారిక నాగబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.ఇక నాగబాబు తరుపున ప్రచారానికి మెగా హీరోలు వరుణ్ తేజ్ వస్తాడని ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంకి వస్తారని అందరూ భావించిన ఊహించని విధంగా అల్లు అర్జున్ ఓ లేఖ రిలీజ్ చేసి జనసేన పార్టీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ప్రకటించాడు.అయితే ఎన్నికల ప్రచారంలోకి మాతం రావడానికి అల్లు అర్జున్ ఇస్తాపదలేదని తెలుస్తుంది.ఇక రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న కారణంగా ఎన్నికల ప్రచారంలోకి రావడం లేదు.దీంతో ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి జనసేనకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.