ఒక్క చినుకుకే నేల గొంతు తడి ఆరదు.అలాగే ఈ సమాజాన్ని మార్చాలంటే ఒక్కరు వేసే అడుగు ఏ ఒక్కరిలో మార్పు తీసుకురాదు.
ముఖ్యంగా రాజకీయాల్లో నీతిగా బ్రతికే వారికి అసలు చోటు ఉండదని ఎన్నో సార్లు నిరూపించబడింది.
ఈ చదరంగంలో కుట్రలు, కుతంత్రాలు, అమలుకు సాధ్యం కానీ హామీలు, ఇలా ప్రజలను మభ్య పెడుతూ బ్రతకడమే నేతలు నేర్చుకున్నది.
అందుకే అభివృద్ధికి అందనంత దూరంలో రాష్ట్రాలు, రాష్ట్ర ప్రజలు మగ్గిపోతున్నారు.ఇకపోతే ఈటల వ్యవహారంలో గులాభి ముఖ్య నేతలు అయిన కేసీఆర్, కేటీఆర్ తప్ప మిగతా నేతలు అందరు పెదవి విప్పుతున్నారు.
ఆయన మీద మిమర్శల జోరు పెంచుతున్నారు.తాజాగా అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే వరకు నమ్మకం లేకుండా ప్రయాణం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రాజకీయంగా ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

తనది బహుజన వాదం అని చెప్పుకునే ఈటల రాజేందర్ తన వాదాన్ని బీజేపీ నాయకుల కాళ్ల ముందు తాకట్టు పెట్టారంటూ విమర్శించారు.అయినా ప్రజలకు తెలుసుకుగా పదవులు లేకుంటే బ్రతకలేని నాయకులు ఎవరో? అనవసరంగా విమర్శలు మానేసి ప్రజా సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద మనస్సు మళ్లీస్తే మంచిదని జనం అనుకుంటున్నారట