మన దేశంలో రాజకీయ నాయకులు నిత్యం కేసుల్లో చిక్కుకుంటున్నా.జైళుకు మాత్రం వెళ్లడం కష్టం.
అయితే అది కూడా ఏవో ఫోర్జరీ కేసులో.లేక స్కాముల విషయంలోనో కోర్టుకు తిరుగుతూ ఉంటారు.
కానీ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ మాత్రం ఏకంగా హత్యాకేసులో అరెస్ట్ అయ్యారు.ఎన్నో రోజులుగా ఈ కేసు నడుస్తున్నా.
అవన్నీ ఆరోపణలే అంటూ నెషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తూ వచ్చింది.కానీ తాజాగా ఆ కేసు రుజువు అయింది.
ఎంపీ మహమ్మద్ ఫైజల్ తో పాటు మరో నలుగురికి స్థానిక న్యాయస్థానం పదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ.తీర్పును ప్రకటించింది.
అంతే కాకుండా ఒక్కోక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది.2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సీఎం సయీద్ అల్లుడు పదాంత సాలిహ్ ను హత్య చేయడానికి ఎంపీతో పాటు మరో నలుగురు ప్రయత్నించారు.అప్పట్లో ఈ వార్త బారీ దుమారం లేపింది.అయితే అప్పుడు సాలిహ్ అదృష్టవ శాత్తూ తప్పించుకున్నారు.కోర్టు తీర్పు తర్వాత ఎంపీ ఫైజల్‌తో పాటు మిగిలిన నలుగురిని కన్నూరు సెంట్రల్ జైలుకు తరలించారు.మహమ్మద్‌పై నేరు రుజువు కావడంతో.
ఆయన ఎంపీ పదవి పోయే అవకాశం కూడా ఉంది.

పదవిలో ఉండగా జైలుకు వెళ్లినా.పదవిలో కొనసాగవచ్చు.అయితే అది లోక్ సభ స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఆధార పడి ఉంది.
ఇప్పటికే లక్షద్వీప్ డ్రగ్స్ మాఫియాలో మొదటి స్థానంలో ఉంది.దానికి స్థానిక ఎంపీనే కారణం అనే విమర్శలు కూడా ఉన్నాయి.2009లో మహమ్మద్ మరి కొందరితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్ పై దాడి చేశారు.అతన్ని వెంటబడి కత్తులు, కటార్లు, కర్రలు, ఐరన్ రాడ్లతో కొట్టారు.

ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.దాంతో ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్నాకులంకు తరలించి సకాలంలో వైద్యం అందించడంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.ఇక లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకునేలోగా ఎన్సీపీ నేతలు.ఈ కేసును హైకోర్టులో వేసే చాన్స్ ఉంది.కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఆ పదవి రద్దు కాదు.దాంతో ఈ టర్మ అలా తప్పించుకోవాలని ఫైజల్ భావిస్తున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎలాగైనా పదవి రద్దు చేయించాలని భీష్మించుకు కూర్చున్నారు.