మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి( Raghuveera Reddy ) చాలాకాలంగా యాక్టిివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.పూర్తిగా వ్యవసాయానికి పరిమితం అయ్యారు.
సొంత గ్రామమైన అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురం కు పరిమితం అయ్యారు.చాలా కాలంగా వివిధ రాజకీయ పార్టీలు రఘువీరాను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినా, ఆయన మాత్రం మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు అంత ఆసక్తి చూపించలేదు.
అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యం, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రఘువీరా యాక్టిివ్ అయ్యారు.రఘువీరా రెడ్డి సేవలను ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల( Congress Karnataka Elections )లో వాడుకుంటుంది.

బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా రఘువీరారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.ప్రస్తుతం అక్కడి ఎన్నికలపైనే ఆయన దృష్టి సారించారు. కర్ణాటకలో ఎన్నికల ముగిసిన అనంతరం కచ్చితంగా పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్నారట.ఇప్పటికే వైసీపీ నుంచి ఆహ్వానాలు అందాయి.ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) ఇటీవలే బిజెపిలో చేరారు.అయన కూడా రఘువీరా ను బీజేపీ లోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ బలపడే అవకాశం లేకపోవడంతో రఘువీరా కూడా ఆలోచనలో పడ్డారట.

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు వ్యవహారాల్లో ఉన్న రఘువీరా బిజెపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా, ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన బిజెపిలో చేరి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయన బీజేపీ లో చేరితే కీలకమైన పదవి కూడా ఇచ్చేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధంగా ఉందట.అయితే ఒకవైపు ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి ఆహ్వానాలు అందుతుండడం, మరో వైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఒత్తిడి చేస్తుండడం తో పార్టీ మరే విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో రఘువీరా ఉన్నారట.







