పుష్ప 2 సక్సెస్ అవ్వాలంటే అల్లు అర్జున్ ఈ ఒక్కటి చేయాల్సిందే...

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా మీద ఇప్పటికి నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది.

మరి నెగటివ్ ప్రచారం అంతా పోవాలి అంటే మాత్రం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలిసి పోవాలి అంటూ సినిమా మేధావులు సైతం అతనికి సలహాలను ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సరైనోడు ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్( Allu Arjun ) చెప్పను బ్రదర్ అన్నప్పుడే ఆయన మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.

ఇక దాంతో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో మరోసారి కలిసిన అల్లు అర్జున్ కొద్ది వరకు ఆ నెగటివ్ ప్రచారాన్ని తగ్గించుకోగలిగాడు.ఇక మరోసారి వైసిపి పార్టీకి క్యాంపెనింగ్ చేసి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెగిటివిటి ని స్ప్రెడ్ చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా పోస్ట్ అవ్వడానికి కూడా అదే కారణం అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.మరి అది సాధ్యం అవ్వాలంటే మాత్రం ఆయన తప్పకుండా మెగా ఫ్యామిలితో కలిసి పోవాలి అలా అయితేనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుంది.

Advertisement

లేదంటే మాత్రం మెగా ఫ్యామిలీ( Mega Family ) అభిమానుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను తట్టుకోని నిలబడేంత కెపాసిటీ ఈ సినిమాకు అయితే లేదు అంటూ ఇంకొంతమంది చెబుతున్నారు.

ఇక సుకుమార్ కూడా ఈ సినిమాని అందుకే ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక అలా చేస్తే మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి కొంతవరకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుందేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు