ఈ నీటిని ఇంటి మొత్తం చల్లితే అన్ని శుభాలే..!

మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చాలా మంది వాస్తుశాస్త్రలను, జ్యోతిష్య శాస్త్రాలను ఎంతో ఎక్కువగా విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే ఇంట్లో ఏ ఒక్కరి జాతక దోష ప్రభావం ఉన్నప్పటికీ ఇల్లు మొత్తం ఎన్నో సమస్యలను, కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది.

ఈ విధంగా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది వాస్తు శాస్త్ర నిపుణులను లేదా జ్యోతిషశాస్త్ర నిపుణులను కలిసి వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అడుగుతుంటారు.అయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కాకుండా ఇంటిలోకి ఏ విధమైనటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి.

ఈ క్రమంలోనే ప్రతి రోజు ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గోమూత్రం తీసుకొని అందులో కొన్ని నీటిని కలిపి మన ఇంటి పరిసర ప్రాంతాలు ఇంటి లోపల, డబ్బు నిల్వ చేసే చోట, వంటగదిలోని పాత్రలపై చల్లాలి.గోమూత్రానికి అన్ని పాపాలను హరించే శక్తి ఉంటుంది.

ప్రతి రోజు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా మన ఇంటి పై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది.ఇలా గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

Advertisement

ఈ విధంగా తీసుకువచ్చిన గోమూత్రంలోకి కొద్దిగా పసుపు నీటిని కలిపి ఆ పసుపు నీటితో మంగళవారం, శుక్రవారం మొత్తం ఇంటిని శుభ్రం చేయాలి.పసుపు ఎంతో మంగళకరమైనది గా భావిస్తాము.పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కనుక పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంది.

ఈ విధంగా ఇంటిని శుభ్రం చేయటం వల్ల ఆ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఇక చాలామంది కాశి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ గంగాజలాన్ని తీసుకువస్తారు.

అలా తీసుకు వచ్చిన నీటితో ఇంటిని శుభ్రం చేసే ఆ తర్వాత పూజ సామగ్రిని పూజ ఫోటోలను గంగాజలంతో శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది.ఇక చాలామంది దేవుడి సామాగ్రి శుభ్రం చేసేటప్పుడు పాత్రలు కడిగే సబ్బుతో శుభ్రం చేస్తుంటారు.ఇలా చేయడం మహా పాపం.

దేవుడి సామాగ్రిని శుభ్రపరచడం కోసం ప్రత్యేక వస్తువులను ఉపయోగించి ఉన్నప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు