భోజనం కోసం కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని.. సింగర్ మనో కన్నీళ్ల గాధ!

పాటైనా, మాటైనా.నవ్విచడమైనా.

ఏదైనా సరే ఆ పాత్రలో మునిగిపోయి 100% ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయడంలో.

ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు ఆయనే సాటి.

నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత గానంతో గాయకుడిగా సంగీతాభిమానుల మనసులు దోచుకుంటూనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా తనలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తున్నారు మనో.సతీసమేతంగా తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మనో, ఆయన సతీమణి జమీల ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ తన చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం తన అదృష్టమన్న మనో, చక్రవర్తి గారి దగ్గర చేరిన తర్వాత హార్మోనియం వాయించడం, పాటలు పాడడం.గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్‌ అసిస్టెంట్ ఇలా అన్నిరకాల పనులూ చేశానని ఆయన అన్నారు.

Advertisement

అమ్మానాన్న కాకుండా తన లైఫ్‌లో ముఖ్యమైంది .తన సోదరి మహిజ అన్న మనో.తాను స్థిరపడటానికి ఆమే కారణమన్నారు.ఇల్లు, స్థలం కొనడం ప్లానింగ్‌ అంతా ఆమె వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆమె తరువాత తన సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జమీలే అని.తను నా భార్యగా దొరకడం అదృష్టమని ఆయన తెలిపారు.పనివెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం మన పని.ఇంటిని, పిల్లల బాధ్యతను మోయడం సాధారణ విషయం కాదని మనో అన్నారు.

జీ ఆనంద్‌గారు మా అమ్మానాన్నలతో పనిచేసేవారట. తాను విశ్వనాథ్‌గారి దగ్గర పనిచేస్తున్నానని తెలిసి ఆయనకు దగ్గరలోనే రూ.35కు అద్దె గది చూపించారని ప్రతినెలా రూ.150 పంపించేవాడినని మనో తెలిపారు.మిగిలిన డబ్బులతోనే నెలంతా గడిపేవాడినని మంచి భోజనం చేయాలంటే అప్పుడు పాండిబజార్లోని కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని.

ఒకసారి వెళ్తే మళ్లీ 15 రోజుల వరకూ అటు దిక్కు వెళ్లేవాడిని కాదని వాచ్‌మెన్‌ గుర్తుపడతాడేమోనని భయం ఉండేదని అయన ఒకప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ప్రస్తుతం ఈయన జబర్దస్త్ షోలోనూ అందర్నీ నవ్విస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గాయకుడు మనో.ఇలా సాఫీగా సాగిపోతున్న జమీల - మనో వైవాహిక జీవితంలో.మరెన్నో మధుర స్మృతులు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

మరెన్నో మరపురాని అనుభూతులు ఉండాలని .ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు