దేవాలయం వద్ద కోనేరు ఎందుకు ఉంటుందో తెలుసా?

మనం ఏ పుణ్యక్షేత్రం వెళ్లిన అక్కడ కోనేరు ఉండటాన్ని గమనిస్తాం.దాదాపుగా పాత దేవాలయాలలో తప్పనిసరిగా కోనేరు ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కట్టిన దేవాలయాలలో కోనేరు కనపడటం లేదు.ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఎక్కువగా నదులు ప్రవహించే తీరాల్లో నిర్మించబడ్డాయి.

కోనేరు,దేవాలయానికి ఏమైనా సంబంధం ఉందా.అని ఆలోచిస్తే దానికి కూడా ఒక కారణం కనపడుతుంది.

ఇప్పడు ఆ కారణం గురించి తెలుసుకుందాం.

Advertisement

నీటిని ప్రాణానికి,జీవానికి ప్రతీకగా చెప్పుతారు.దేవాలయాలు ప్రశాంతతకు చిహ్నంగా చెప్పుతారు.దేవాలయాలలో చేసే చాలా అంటే ఇంచుమించు ప్రతి కార్యక్రమానికి నీరు అవసరం అవుతుంది.

దేవలయములో జరిగే మంత్రోచ్చారణలు ,పుణ్యకార్యాల శక్తిని నీరు నిక్షిప్తము చేసుకుంటుంది.అలాగే సంధ్యావందనములకు, పితృకార్యాలకు, అర్ఘ్య పానాదులకు, పుణ్య స్నానాదులకు కోనేటిలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది.

ఇదివరకు చాలా మంది భక్తులు,యాచకులు,దేవాలయ పరిసరాలలో నివసించే పశు పక్ష్యాదుల నీటి అవసరాలకు దేవాలయాల్లో ఉండే కోనేరు నీటి అవసరాలను తీర్చేవి.కొన్ని దేవాలయాల్లో ఉన్న కోనేరుకి ప్రసాదం సమర్పించే ఆచారం కూడా ఉంది.

దీని ఉద్దేశం ఏమిటంటే ఆ కోనేటి నీరులో ఉండే జీవులకు ఆహారాన్ని అందించటం.ఏది ఏమైనా మన పెద్దవారు పెట్టిన ఆచార వ్యవహారాల్లో ఏదొక పరమార్ధం దాగి ఉంటుంది.

'టీచర్స్' విస్కీ వెనుక ఇంత మ్యాటర్ ఉందని తెలుసా?
Advertisement

తాజా వార్తలు