అలాంటి డ్రెస్ వేసిన ప్రతిసారి నాన్న గుర్తొస్తారు.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.

ఈ సినిమా నాగార్జునకు ఒక కమర్షియల్ హిట్ అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే జనవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

  ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించిన నాగార్జున ఈ సినిమాలో నాగచైతన్యను తీసుకోవడానికి గల కారణం ఏంటో వివరించారు.

 సోగ్గాడే చిన్నినాయన సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ యూత్ కి కనెక్ట్ కాలేకపోయింది.అందుకోసమే ఆ సినిమాను మించి ఉండేలా ఇందులో నాగచైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో నటించారని తెలిపారు.

Advertisement

ఈ క్రమంలోనే యాంకర్ నాగార్జునను ప్రశ్న అడుగుతూ ఈసినిమాలో మీరు మీ అబ్బాయి నటించినప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ మనం సినిమా మేము కాకుండా వేరే ఆర్టిస్టులతో చేసి ఉంటే అంతగా వర్కౌట్ అయ్యేది కాదని తెలిపారు.ఇందులో నాన్న, నేను, నాగ చైతన్య ముగ్గురిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.

అదేవిధంగా నేను పంచే కట్టిన ప్రతిసారీ నాన్నగారే గుర్తొస్తారని ఈ సందర్భంగా నాగార్జున దివంగత నాగేశ్వరరావు గురించి తలచుకుని ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ సినిమా 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు