అలాంటి డ్రెస్ వేసిన ప్రతిసారి నాన్న గుర్తొస్తారు.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.ఈ సినిమా నాగార్జునకు ఒక కమర్షియల్ హిట్ అని చెప్పవచ్చు.

 Akkineni Nagarjuna Interview About Bangarraju Movie Akkineni Nagarjun, Bangarraj-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే జనవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

  ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించిన నాగార్జున ఈ సినిమాలో నాగచైతన్యను తీసుకోవడానికి గల కారణం ఏంటో వివరించారు.

 సోగ్గాడే చిన్నినాయన సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ యూత్ కి కనెక్ట్ కాలేకపోయింది.అందుకోసమే ఆ సినిమాను మించి ఉండేలా ఇందులో నాగచైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో నటించారని తెలిపారు.

ఈ క్రమంలోనే యాంకర్ నాగార్జునను ప్రశ్న అడుగుతూ ఈసినిమాలో మీరు మీ అబ్బాయి నటించినప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ మనం సినిమా మేము కాకుండా వేరే ఆర్టిస్టులతో చేసి ఉంటే అంతగా వర్కౌట్ అయ్యేది కాదని తెలిపారు.ఇందులో నాన్న, నేను, నాగ చైతన్య ముగ్గురిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.

అదేవిధంగా నేను పంచే కట్టిన ప్రతిసారీ నాన్నగారే గుర్తొస్తారని ఈ సందర్భంగా నాగార్జున దివంగత నాగేశ్వరరావు గురించి తలచుకుని ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ సినిమా 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube