బన్నీ అప్పటి మాటలకు అఖిల్‌ లేటెస్ట్‌ వ్యాఖ్యలు కౌంటర్‌ అంటున్నారు.. అఖిల్‌ వర్సెస్‌ అల్లు అర్జున్‌ ఇది ఎంత వరకు నిజం

అల్లు అర్జున్‌ ఆమద్య శర్వానంద్‌ హీరోగా నటించిన పడి పడి లేచె మనసు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు.

ఆ సమయంలో బన్నీ మాట్లాడుతూ పెద్దలను పేరు పెట్టి పిలవడం ఏంట్రా, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌.

వారేమైనా సాదారణ వ్యక్తులు అనుకుంటున్నారా, వారు ది లెజెండ్స్‌.

Akkineni Akhil Latest Counter To Allu Arjun

వారిని విమర్శించినా కూడా గౌరవం ఇచ్చి మరీ విమర్శించాలి.చిరంజీవి గారు, పవన్‌ కళ్యాణ్‌ గారు అంటూ విమర్శించుకోండి అంటూ బన్నీ హెచ్చరించాడు.శర్వా నాకు ఆప్త మిత్రుడే అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు అయినప్పుడు ఖచ్చితంగా శర్వానంద్‌ గారు అంటూ నేను పిలుస్తాను.

Akkineni Akhil Latest Counter To Allu Arjun

నా కంటే చిన్న వాడైనా, ఎలాంటి వారినైనా కూడా నేను పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గారు అంటూ సంభోదిస్తాను.అది వారికి మనం ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను.అంతే కాని పేరు పెట్టి పిలిచి వారిని చిన్నబుచ్చను అన్నాడు.

Advertisement
Akkineni Akhil Latest Counter To Allu Arjun-బన్నీ అప్పటి

ఇప్పుడు అచ్చు అలాంటిదే అఖిల్‌ మిస్టర్‌ మజ్ను చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో జరిగింది.అఖిల్‌ మరియు బన్నీలు పూర్తి విరుద్దమైన వ్యాఖ్యలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో అసలు అఖిల్‌, బన్నీలు కావాలని ఇలా వివాదాన్ని రాజేస్తున్నారా అనిపిస్తుంది.

Akkineni Akhil Latest Counter To Allu Arjun

తాజాగా అఖిల్‌ ఏమన్నాడంటే.ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ తారక్‌ గారు అంటూ పిలిస్తే ఏంట్రా బలిసిందా, గారు ఎందుకు అంటారు.అందుకే తారక్‌ అంటాను.

నేను తారక్‌ ను టైగర్‌ అంటూ పిల్చుకుంటాను.తారక్‌ నాకు ఆ చొరవ నాకు ఇచ్చాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

గారు అనాల్సిన అవసరం లేదు అనేది తారక్‌ అభిప్రాయం.కాని బన్నీ మాత్రం తప్పకుండా గారు అనాల్సిందే అంటాడు.

Advertisement

మొత్తానికి అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌ ల గారు పదంపై పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తారు.

తాజా వార్తలు