అభిజిత్ అలాంటి వ్యక్తి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన అఖిల్..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్ కాగా అఖిల్ రన్నరప్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ అభిజిత్ గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ మోనాల్ అఖిల్ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ హైలెట్ అయిన సంగతి తెలిసిందే.

ఒక విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్లే బిగ్ బాస్ సీజన్ 4 ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది.అయితే మొదట్లో అభిజిత్ తో సన్నిహితంగా మెలిగిన మోనాల్ ఆ తరువాత అభిజిత్ కు దూరమైంది.

అభిజిత్ మోనాల్ కు మధ్య దూరం పెరిగిన తరువాత అఖిల్ సైతం అభిజిత్ తో మాట్లాడటం తగ్గించాడు.అప్పుడప్పుడూ అఖిల్ అభిజిత్ మధ్య కొన్ని విషయాల్లో గొడవలు కూడా జరగడం గమనార్హం.

Advertisement

అభిజిత్ తో గొడవ జరిగిన తరువాత తాను అతనితో చాలాసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించానని అఖిల్ అన్నారు.

అయితే తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా అభిజిత్ నుంచి సరైన స్పందన వ్యక్తం లేదని అఖిల్ తెలిపారు.అతనితో స్నేహం చేద్దామని కలిసిపోవాలని ప్రయత్నించినా సరైన రెస్పాన్స్ దక్కలేదని చెప్పారు.అభిజిత్ కు మోనాల్ కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించానని అయితే అతను తనకు సమయం కావాలని ఆన్నాడని చెప్పారు.

అప్పుడు అభిజిత్ తనకు సమయం కావాలని అన్నాడని కానీ ఆ తరువాత ఏమీ చెప్పలేదని అన్నారు.మరోవైపు అఖిల్ కు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.అయితే కొన్నిసార్లు ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉండటంతో ఆఫర్ ఫైనలైజ్ అయిన తరువాత అధికారికంగా ప్రకటించాలని అఖిల్ భావిస్తున్నాడని తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు