మనాలిలో 'ఏజెంట్'.. హై యాక్షన్ సీక్వెన్స్ కోసం టీమ్ అంతా సిద్ధం!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా స్టార్ట్ చేసాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.అందుకే ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు చిత్ర యూనిట్ తెలిపారు.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మనాలీ వెళ్లిందట.

Advertisement
Akhil Akkineni's Agent Shooting In Manali, Manali, Akhil Akkineni, Agent Movie,

ఇక్కడే హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం టీమ్ అంతా మనాలీ లోకి అడుగు పెట్టారు.ఈ సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ నే హైలెట్ కానున్నాయట.

అందుకే ఈ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ తో పాటు అఖిల్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఏకే ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మమ్ముట్టి విలన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయినా అఖిల్ స్టైలిష్ లుక్ లో కండలు తిరిగిన శరీరంతో ఆకట్టు కుంటున్నాడు.

Akhil Akkinenis Agent Shooting In Manali, Manali, Akhil Akkineni, Agent Movie,

రా ఏజెంట్ గా నటిస్తున్న అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమా కోసం అఖిల్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.రెమ్యునరేషన్ కంటే క్వాలిటీ ముఖ్యమని సినిమా బాగా రావడం కోసమే ఈయన రెమ్యునరేషన్ వద్దనుకున్నాడట.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అయితే రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు అనే వార్త కూడా ప్రచారంలో ఉంది.ఇక ఏజెంట్ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు