నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో విప్లవకారులు ఐక్యం కావాలి:- ఇప్ట్యూ నేత పి.ప్రసాద్

నక్సల్బరీ మేఘగర్జన కు 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పరకాల నాగన్న అధ్యక్షతన సదస్సు జరిగింది ఈ సదస్సులో ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి పి ప్రసాద్,ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ నక్సల్బరీ ఉద్యమం ఈ దేశ కమ్యూనిస్టులకు ఒక పంధాను ఒక కొత్త మార్గాన్ని చూపిన నక్సల్బరి పోరాటం ఒక ప్రాంతంలో ది అయినప్పటికీ ఈ దేశంలో దావానలంలా వ్యాపించి దేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక ఊపు ఊపిందిఈ క్రమంలో ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం నక్సల్బరి స్ఫూర్తితో అనేక విద్యార్థి ఉద్యమాలు ముందుకు వచ్చాయి.

 Revolutionaries Must Unite In The Spirit Of Naxalbury Movement: - Iptu Leader P.-TeluguStop.com

నక్సల్బరీ ఉద్యమాన్ని స్మరించుకోవటం మే కాదు ఆచరణలో చూపాలి ఈరోజు పీడిత ప్రజలకు కమ్యూనిస్టుల కమ్యూనిస్టు ఉద్యమాల అవసరం పెరిగింది కానీ ఇలాంటి సమయంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డాయి ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులలో విప్లవకారుల నక్సల్బరి ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం పెరిగిందని వారు అన్నారు ప్రజా ఆందోళనలు కార్యక్రమాలు కార్యకర్తలను ఉత్తేజ పరుస్తాయి కానీ కమ్యూనిస్టు ఆచరణను ముందుకు తీసుకు పో లేవు ఇవి నక్సల్బరి స్ఫూర్తితో ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని వి ప్రసాద్ అన్నారు ఈ రోజు విప్లవకారులు ఐక్యం అవ్వడం కోసం దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న ఈ సందర్భంలో న్యూడెమోక్రసీ పార్టీ నుండి కొంతమంది విడివడి వారి రాజకీయాలకు కేంద్ర కమిటీ అడ్డుగా ఉందని విడిపోయి ప్రజా పండగ ఏర్పడ్డారు ఈరోజు వరకు వారి ఆచరణ వారి పని లేదు ఈరోజు వారునూతన సంపన్న వర్గానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మిస్తుంటే కేంద్ర కమిటీ ఎప్పుడు అడ్డుకున్నది తెలపాలని అన్నారు ఖమ్మంలోనయా సంపన్న వర్గ ప్రతినిధి అయిన వేల కోట్ల అధిపతి అయిన పువ్వాడ నాగేశ్వరరావు అజయ్ కుమార్ కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే కేంద్ర కమిటీ ఎప్పుడు అడ్డుకున్నది తెలపాలని అన్నారు అదేవిధంగా ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమలు పారిశ్రామిక వాళ్ల పరిశ్రమలో జరుగుతున్న కార్మికుల ప్రమాదాలు మరణాలపైప్రజా పంది వారు ఏమైనా ఉద్యమాలు నిర్మిస్తే ఇప్పుడు అడ్డుకున్నది తెలపాలని అన్నారు అదేవిధంగా ఖమ్మంలో ప్రైవేటు విద్యాసంస్థలు మెడికల్ మాఫియాలకు వ్యతిరేకంగా ప్రజా పంది వారు ఎన్ని ఉద్యమాలు నిర్మిస్తే వాటిని ఆపమని చెప్పిన సందర్భాలు ఏమిటో వారే తెలియజేయాలని అన్నారు ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు విప్లవకర ఆచరణకు దూరమై ప్రజా ఉద్యమాలకు ద్రోహం చేస్తూ వారు విడిపోయి కొత్త కుంపటి పెట్టుకున్నారు దేశం లోహిందూ ఫాసిజం తెలుగు పోతున్న సందర్భంలో ఆర్థిక సంక్షోభ స్థితి వైపు ప్రయాణం జరుగుతున్న క్రమంలో ప్రజా ఉద్యమాలపై నిరంకుశ జరుగుతున్న సందర్భంలో విప్లవకారుల అందరు ఐక్యంగా కావలసినటువంటి సందర్భంలో మీరు విడిపోయి నక్సల్బరీ పేరు చెప్పడానికి ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో వారు ఉన్నారని పి.ప్రసాద్ అన్నారు *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవును మధు మాట్లాడుతూ* నక్సల్బరీ స్ఫూర్తితో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం ముందుకు వచ్చిందని దానిలో భాగంగా ఆదివాసి ప్రాంతాలలో ఏజెన్సీ ఆదివాసీలు కూటికి లేని పరిస్థితులలో జీవిస్తున్నారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి తిండి గుడ్డ కోసం వారు స్వతంత్రులుగా జీవించడం కోసం ఏజెన్సీ ప్రాంతంలో ఆక్రమించి లక్షలాది ఎకరాలను ఆదివాసి ప్రజలకు వివరించడం జరిగింది వారు ఈ రోజు ఆత్మగౌరవంతో జీవించే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పోరాటాలే కారణమని అన్నారు ఆదివాసీ ప్రజలు ఎలా జీవించాలో తెలియని స్థితి నుండి వారికి వ్యవసాయం చేసుకోవడం నేర్పిందని ఈ రోజు అనేక పంటలను పండించే స్థాయికి ఆదివాసీలకు సహకరించిందని అన్నా రు ఆదివాసీ ప్రాంతాలలో విద్య వైద్యం మార్కెటింగ్ వ్యవస్థలను కొంత మేరకు పార్టీ అభివృద్ధి చేసిందని అన్నారుఇవన్నీ కూడా విప్లవకర ఉద్యమాల ఫలితంగానే సాధ్యమైనా అని అన్నారు కానీ ప్రజపంథా ఈరోజు విప్లవం పేరు చెప్పటానికి భయపడుతున్నారని ఉద్యమాలకు ద్రోహం చేస్తూ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి అని అన్నారు ఇప్పటికైనా శ్రేణులు విప్లవ ఉద్యమ నిర్మాణానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో భూస్వాముల దళారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలను ప్రజలను సమీకరించి నిర్మించిందని అన్నారు *ఏ ఐ కే ఎమ్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు మాట్లాడుతూ* నక్సల్బరి పోరాటం ఫలితంగా భూసంస్కరణల చట్టాలు ,1/70 చట్టం రాజభరణాల రద్దు చట్టం లాంటివి వచ్చాయని అన్నారు నక్సల్బరీ స్ఫూర్తితో తో శ్రీకాకుళ సాయుధ పోరాటం,గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు వచ్చాయని అన్నారు ఈ పోరాటాల ఫలితంగా వడ్డీ వ్యాపారులు కు వ్యతిరేకంగా పేద ప్రజలకు భూములు పంపకం జరిగిందని అన్నారు ఆదివాసీలు తమ హక్కులను కొంతమేరకైనా కాపాడుకో గలిగారు అని అన్నారు నక్సల్బరీ ఉద్యమం తరువాత వేలాది మంది విప్లవకారులు రాజ్య హింసకు ,భూస్వాముల హత్యలకు ఎన్కౌంటర్లకు గురి అయినప్పటికీ ఆ ఉద్యమాన్ని అనచలేక పోయారని వారు అన్నారు ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు, రైతు పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని , పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇవ్వకపోగా ఫారెస్ట్ అధికా రులతో ఆదివాసీలపై సాగు దారులపై దాడులు పెరిగాయి అని అన్నారు నక్సల్బరీ స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube