అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేష్..?

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ మధ్యనే విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్ లో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

ఇంకా టీజర్ చుసిన తర్వాత అయితే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయనే చెప్పాలి.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొద్దీ మంది సభ్యులతో జరుగుతుంది.అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ కు చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించబోతుందని సమాచారం.ఈమె పాత్ర ఇందులో ఎమోషనల్ గా సాగుతుందని ఈ పాత్రే సినిమాకు కీలకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?

ఈమె చనిపోవడానికి కారణమైన ఒక పోలీస్ పై అల్లు అర్జున్ తన పగ ఎలా తీర్చుకున్నాడు అనేది ఈ సినిమాలో హైలెట్ గా ఉండనుందని సమాచారం.చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.

Advertisement

అయితే ఈ సినిమాను ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా వార్తలు