ఐశ్వర్య రాజేష్ తాతకి కోపం.. తండ్రికి టెక్కు.. శ్రీ లక్ష్మీ కామెడియన్ అయిపోయి బతికిపోయింది..??

కమెడియన్ శ్రీ లక్ష్మీ( Actress Srilakshmi ) తండ్రి అమర్‌నాథ్ గురించి ఇప్పటి తరం వారికి పెద్దగా తెలిసి ఉండదు.1950 కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగాడు.

ఇతని అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్.1925లో జన్మించిన అమర్‌నాథ్ రాజమండ్రి టౌన్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ పెమ్మరాజు రామారావు ప్రోత్సాహంతో "తులాభారం" నాటకంలో సత్యభామ వేషం వేసి మెప్పించాడు.అలా అమర్‌నాథ్ ఆడ వేషాలు కట్టడం ప్రారంభించి నటనపై మక్కువ పెంచుకున్నాడు.1943లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి "వైజాగ్ సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంటు"లో రేషనింగ్ ఎంక్వరీ ఆఫీసర్‌ అయ్యాడు.ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నాటకాల్లో నటించేవాడు.

తర్వాత సినిమా వాళ్లు పరిచయం కావడంతో "అమ్మలక్కలు" మూవీలో ఎన్టీఆర్ తమ్ముడుగా నటించే అవకాశం సంపాదించాడు.డి.యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అతడు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఇరగదీశాడు.అందుకే ఎన్టీఆర్ తన "పిచ్చిపుల్లయ్య" సినిమాలో తనతో సమానమైన పాత్ర ఆఫర్ చేశాడు.

దీని తర్వాత ఆడబిడ్డ, వదినగారి గాజులు, వరుడు కావాలి, వద్దంటే పెళ్లి లాంటి చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యాడు.

Aishwarya Rajesh Family Background ,actress Srilakshmi , Aishwarya Rajesh , Raje

అయితే ఈ యాక్టర్ హీరోగా సక్సెస్ అవ్వాల్సి ఉంది.కానీ అతడికి కోపం చాలా ఎక్కువగా ఉండేది.ఇతరులతో ఎలా నడుచుకోవాలో పెద్దగా తెలియజేయకపోయేది కాదు.

Advertisement
Aishwarya Rajesh Family Background ,Actress Srilakshmi , Aishwarya Rajesh , Raje

లౌక్యం తెలియకుండా ప్రవర్తిస్తూ హీరో స్థాయికి ఎదగాల్సిన ఆయన అలా ఎదగకుండానే సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లాల్సి వచ్చింది.ఈయనకి ఎంత కోపం ఉండేదంటే చిన్న చిన్న సమస్యలకే కోర్టులో కేసులు వేసేవారు.

అప్పట్లో ఆయనే సొంతంగా "మగవారి మాయలు" సినిమా తీసి, డిస్ట్రిబ్యూటర్ల మీద కేసులు వేశాడు.అంతేకాదు తాను నటించిన నిర్మాతల మీద కూడా ఎడాపెడా కేసులు ఫైల్ చేసేవాడు.

దాంతో అతడితో సినిమా చేయాలంటేనే భయపడి పోయేవారు.క్రమేపి అతనితో సినిమా చేసేవారు లేకుండా పోయారు.

అయితే అమర్నాథ్ కూతురు శ్రీ లక్ష్మీ అతనికి ఇష్టం లేకపోయినా ఆర్థిక సమస్యల వల్ల నటిగా మారింది.శ్రీ లక్ష్మీ మొదటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన "రాజా రాణీ జాకీ" సినిమాలో ఓ సీరియస్ రోల్‌లో చేసింది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఆ సినిమా పెద్దగా ఆడలేదు.హీరోయిన్ మెటీరియల్ అని చాలామంది ప్రశంసిస్తుండడంతో ఆమె ఆ పాత్రలకే ట్రై చేసింది.

Advertisement

కానీ సక్సెస్ కాలేకపోయింది.జంధ్యాల ఆమె మంచి కమెడియన్ అవుతుందని గుర్తించారు.

కమెడియన్ పాత్రలు చేయడానికి ఆమె ఒప్పుకుంది.అవి చేసిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

జంధ్యాల లేకపోయి ఉంటే ఆమె హీరోయిన్ గా ట్రై చేసి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయేది.అమరనాథ్ కొడుకు రాజేష్ కూడా సినిమా రంగ ప్రవేశం చేశాడు.

జంధ్యాల దర్శకత్వంలోనే హీరోగా, విలన్ గా యాక్ట్ చేశాడు.అమరనాథ్ 1980లో కనుమూయగా అప్పటికి రాజేష్ పెద్ద హీరో కాలేదు.

తర్వాత కూడా ఎక్కువ రోజులు సినిమాల్లో కొనసాగలేకపోయాడు.దానికి ముఖ్య కారణం ఏంటంటే రాజేష్ విలన్ గా నటించినా తానే హీరో అనే లాగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేవాడు.హీరో కావాల్సిన నేను పరిస్థితులు కలిసిరాక ఈ నెగటివ్ పాత్రలో నటిస్తున్నాను అన్నట్టుగా అతడి యాక్టింగ్ ఉండేది.

అందుకే ఆయన కూడా ఎటూ కాకుండా సినిమాల్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది.హీరోగా నటిస్తున్న రోజుల్లోనే ఓ డాన్స్ అసిస్టెంట్ ను మ్యారేజ్ చేసుకున్నాడు.

రాజేష్ కూడా తండ్రి అమరనాథ్ లాగానే చిన్న వయసులోనే మరణించాడు.రాజేష్ కూతురు ఐశ్యర్య రాజేష్( Aishwarya Rajesh ) ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మెప్పిస్తోంది.

తాజా వార్తలు