చీరకట్టులో కర్రసాము చేసిన ఆధా శర్మ

టాలీవుడ్ హీరోయిన్ ఆధాశర్మ చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియా ద్వారా అందరికి అందుబాటులో ఉంటుంది.

హీరోయిన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్ లు పెట్టుకుంటే ఆదా శర్మ మాత్రం కాస్తా భిన్నమైన ప్రయత్నం చేస్తుంది.

తనలోని టాలెంట్ ని ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చూపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఫీట్ లు ట్రై చేస్తూ ఉంటుంది.

ఆమె డిఫరెంట్ గా చేసే యాక్టివిటీస్ చూడటానికి చాలా మంది ఆధాశర్మని ఫాలో అవుతూ ఉంటారు.ఆమెలో మంచి క్లాసికల్ డాన్సర్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో అప్పుడప్పుడు కథక్ డాన్స్ ప్రావీణ్యం కూడా ఆదాశర్మ ప్రదర్శిస్తూ ఉంటుంది.తాజాగా తనలో ఓ మంచి ఫైటర్ ఉంది అనే విషయాన్ని ఆమె ఒక వీడియోలో ప్రెజెంట్ చేసింది.

Advertisement

ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యలో కర్రసాము ఒకటిగా ఉంటుంది.పల్లెటూళ్ళలో ఈ కర్రసాము ఎక్కువ మంది చేస్తూ ఉంటారు.

ఒకేసారి ఎక్కువ మందిపై దాడి చేయడానికి కర్రసాము విద్యని వాడుతారు.తాజాగా ఈ బ్యూటీ సముద్ర తీరంలో అది కూడా చీరకట్టులో రెండు చేతులతో కర్రసాము ఆడింది.

దానికి సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్ అయ్యింది.ఓ వైపు స‌ముద్ర అల‌లు ఎగిసిప‌డుతూ భీక‌ర‌మైన శ‌బ్దం చేస్తుంటే బీచ్‌లో చాలా ధైర్యంగా కర్రసాము చేసింది.

అదే స‌మ‌యంలో బీచ్ వెంబ‌డి శున‌కాల సైన్యం ఆదాశ‌ర్మ వైపు వచ్చింది.ఆదాశ‌ర్మ శున‌కాల‌ను దగ్గరకి పిలుస్తూ.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆ త‌ర్వాత వాటితో క‌లిసి బీచ్ వెంట ప‌రుగులు పెట్టింది.ఈ వీడియోని 80 వేల మందికి పైగా చూడటం విశేషం.

Advertisement

మొత్తానికి సినిమాలలో కరెక్ట్ గా వాడుకుంటే ఆధాశర్మ మంచి యాక్షన్ హీరోయిన్ అయిపోతుందనే ఆమె టాలెంట్ చూసి చెప్పొచ్చు.

తాజా వార్తలు