Sanghavi : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన నటి సంఘవి.. ఫోటోస్ వైరల్?

తెలుగు వారికీ అలనాటి నటి సంఘవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె మొదట కెరియర్ లో చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

అంతే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది.తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజ శేఖర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది సంఘవి.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.తెలుగులో దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది సంఘవి.

ఇది ఇలా ఉంటే ఒకప్పటి తారలు ఇటీవల కాలంలో ఒక్కొక్కరుగా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.కాగా నటి సంఘవి కూడా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Advertisement

కాగా ఈమె 2016లో ఐటీ సంస్థ అధినేత ఎన్.వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంది.వీరికి ఒక పాప కూడా ఉంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఆమె తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.ఆమెతో పాటు భర్త, కూతురు కూడా ఉన్నారు.

అయితే సంఘవిని అలా చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎందుకంటే సంఘవి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.జనాలు ఆమెను కనిపెట్టడానికి కష్టపడాల్సి వచ్చింది.ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.గుడిలోనుండి బయటకు వచ్చిన తర్వాత మీడియా సంఘవిని పలకరించగా.

Advertisement

ప్రస్తుతం టీవీషోల జడ్జిగా చేస్తున్నానని, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు సంఘవి.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు