తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా హీరో గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో కమల్ హాసన్ ఒకరు…ఇయన తన కెరియర్ లో ఎన్నో పాత్రలని పోషించి లోక నాయకుడు అనే బిరుదు కూడా పొందారు…ఇక ఇప్పుడు ఈయన దర్శకుడు శంకర్ తో ఇండియన్ 2( Indian 2 ) అనే భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం అనంతరం కమల్ సాలిడ్ లైనప్ ని సిద్ధం చేసుకోగా ఈ లైనప్ లో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోద్( Director H Vinoth ) తో కూడా ఓ చిత్రం ఉంది…
మరి ఈ సినిమాపై అయితే కోలీవుడ్ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.ఈ చిత్రం కూడా వినోద్ గత చిత్రాలు తరహాలోనే ఒక సోషల్ డ్రామాగా తెరకెక్కనుందట.మరి ఈ సినిమాలో రైతుల సమస్యలని మేకర్స్ హైలైట్ చేయనున్నారట.మరి లాస్ట్ టైం డ్రగ్స్, బ్యాంకింగ్ కి సంబంధించి అజిత్ తో వలిమై( Valimai ) అలాగే తెగింపు అనే ఇంట్రెస్టింగ్ చిత్రాలు తీసిన వినోద్ ఈసారి కమల్ తో ఎలాంటి ఇష్యూని టచ్ చేస్తాడో చూడాలి…
అయితే ఇప్పటికే ఈ కాంబినేషన్ మీద అటు సినిమా ఇండస్ట్రీ లోనూ, ఇటు ప్రేక్షకుల లోనూ మంచి అంచనాలు ఉన్నాయి… ఇక ప్రస్తుతం కమల్ హాసన్, ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా( Project K ) లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే…అలాగే శంకర్ తో చేస్తున్న ఇండియన్ 2 మూవీ మీద కూడా రోజు రోజుకీ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి…గత సంవత్సరం లోకేష్ కనక రాజు డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమల్ హాసన్ తదుపరి చిత్రాల మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి…