కృష్ణవంశీ అలా చేస్తారని అస్సలు ఊహించలేదు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటి మధుమణికి( Actress Madhumani ) గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలలో రాఖీ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

మధుమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురైనా గోదావరి సినిమాలో నటించానని ఆమె తెలిపారు.రాఖీ సినిమాలో( Rakhi Movie ) నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించానని ఆమె అన్నారు.

కృష్ణవంశీ గారు( Krishnavamshi ) ఆ పాత్రకు నన్ను ఎంపిక చేస్తారని అస్సలు ఊహించలేదని అలాంటి రోల్ కు నన్ను ఎందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ అర్థం కాదని ఆమె కామెంట్లు చేశారు.అప్పటివరకు నేను సాఫ్ట్ రోల్స్ లో చేశానని మధుమణి అన్నారు.

మురారి సినిమాలో నేను చేయాల్సి ఉందని కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని ఆమె తెలిపారు.ఆ సమయంలో కుదరలేదని మధుమణి కామెంట్లు చేశారు.

Actress Madhumani Comments About Krishnavamnsi Details, Krishnavamsi, Actress Ma
Advertisement
Actress Madhumani Comments About Krishnavamnsi Details, Krishnavamsi, Actress Ma

నా స్థానంలో అనితా చౌదరి( Anitha Choudary ) నటించారని ఆమె పేర్కొన్నారు.రాఖీ సినిమాలో ఛాన్స్ రాదని అనుకున్నానని కానీ వచ్చిందని మధుమణి తెలిపారు.ఆ పాత్ర విన్నాక షాక్ అయ్యానని ఆమె వెల్లడించారు.

మేకప్ లేకుండా నటించానని ఆమె కామెంట్లు చేశారు.మా అమ్మాయి, అల్లుడు తారక్ కు డై హార్డ్ ఫ్యాన్స్ అని మధుమణి పేర్కొన్నారు.

ఇంద్రగంటి గారితో మూడు సినిమాలు చేశానని ఆమె కామెంట్లు చేశారు.

Actress Madhumani Comments About Krishnavamnsi Details, Krishnavamsi, Actress Ma

మూడు సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించానని మధుమణి అన్నారు.హీరోయిన్లతో పాటు యంగ్ హీరోలకు తల్లిగా చేశానని ఆమె పేర్కొన్నారు.నేను, చంద్రమోహన్( Chandramohan ) 15 సినిమాలు చేశామని మధుమణి కామెంట్లు చేశారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

మధుమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఆమె రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు