Kavita Superstar Krishna : ఆ జీవి వల్ల ఏడ్చేశానన్న ప్రముఖ నటి కవిత.. కృష్ణతో అలా అన్నానంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన కవిత ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వెంకన్న బాబు గారు భిన్నమైన పాత్రలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకునేవారని కవిత అన్నారు.

ప్రస్తుతం ఒక సినిమా పోస్టర్ చూస్తే ఆ పోస్టర్ లోని హీరోయిన్ ఏ సినిమాలో చేశారనే విషయం చెప్పే పరిస్థితి లేదని కవిత పేర్కొన్నారు.ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదని కవిత చెప్పుకొచ్చారు.

అప్పట్లో ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేదానినని ఆమె పేర్కొన్నారు.తాను సిగరెట్లు తాగే పాత్రలో చేశానని ఆమె చెప్పారు.

ఆ సినిమాలో కృష్ణగారు హీరో అని కవిత వెల్లడించారు.ఆయన లతగారిని ప్రేమించాలని అలా చేయాలని ఆమె అన్నారు.

Advertisement

అయితే నేను కృష్ణగారు వచ్చిన వెంటనే నేను కావాలని సిగరెట్ స్మోక్ చేసినట్టు యాక్ట్ చేశానని ఆమె తెలిపారు.ఆ తర్వాత నేను కృష్ణగారితో సినిమా కంటిన్యూ చేయాలా? ఇక్కడితో ఆపేయాలా? అని అన్నానని కవిత తెలిపారు.

మైలు దూరంలో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే నేను పారిపోతానని కృష్ణగారితో నేను అన్నానని కవిత కామెంట్లు చేశారు.అలాంటి నన్ను సిగరెట్ కాల్చాలని సూచించడం ఏమిటని అడిగానని కవిత చెప్పుకొచ్చారు.ఆ ఒక్క షాట్ తీయడానికి మూడు గంటలు పట్టిందని కవిత అన్నారు.

నేను ప్యూర్ వెజిటేరియన్ అని ఆమె పేర్కొన్నారు. బిర్యాని వెజ్ అయినా కూడా నేను తిననని ఆమె పేర్కొన్నారు.

ఒక సీన్ లో చేపను పట్టుకోవాలని చెబితే నేను ఏడ్చేశానని ఆమె అన్నారు.ఎలాంటి కష్టమైనా సీన్లు అయినా చేస్తాను కానీ జంతువులతో సీన్లు అంటే భయపడతానని కవిత అన్నారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

మనిషి మృగం సినిమాలో టైగర్ తో కలిసి యాక్ట్ చేశానని కవిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు