పదో తరగతిలో తనకు ఎన్ని మార్కులు వచ్చాయో బయటపెట్టిన కోలీవుడ్ హీరో

ఈ జెనరేషన్ లో విద్యార్థులు చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యల వరకు వెళ్లిపోతున్నారు.

ముఖ్యంగా పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన ఫెయిల్ అయినా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

జీవితాన్ని ఒక కోణం నుంచే చూస్తున్న పిల్లలు సమాజాన్ని, తల్లిదండ్రులని అర్ధం చేసుకోలేకపోతున్నారు.అదే సమయంలో చదువుల పేరుతో చిన్న వయస్సు నుంచి విద్యార్ధులపై తల్లిదండ్రులు వేస్తున్న భారం మోయలేక చిన్న చిన్న కారణాలకి కూడా ఒత్తిడికి గురవుతూ చావు వరకు వెళ్తున్నారు.

ఇది నిజంగా అందరిని కలవరపెట్టే విషయమని చెప్పాలి.అయితే పడ్డవాడు చెడ్డవాడు కాదు.

తక్కువ మార్కులు వచ్చిన వాడు తెలివి తక్కువ వాడు కాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు వారికి చెప్పేలా ఉండాలి.అలాగే వారు కూడా అర్ధం చేసుకోవాలి.

Advertisement

అప్పుడప్పుడు ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ విషయాలని విద్యార్ధులకి అర్ధమయ్యే విధంగా అవగాహనా కల్పించే ప్రయత్నం చేస్తారు.తాజాగా పదో తరగతి, ఇంటర్, బోర్డు ఎగ్జామ్స్ పరీక్షలకి సంబందించిన రిజల్ట్ వచ్చాయి.

వాటికి సంబందించిన భయం పిల్లలలో పోగొట్టడానికి కోలీవుడ్ హీరో మాధవన్ ఒక ట్వీట్ చేశారు.తనకి పదో తరగతిలో వచ్చిన మార్కులని బయట పెట్టాడు.

తనకి పదో తరగతిలో కేవలం 58 శాతం మాత్రమే మార్కులు వచ్చాయి.మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన అయితే జీవితం ఇక్కడితో ఆగిపోయినట్లు కాదు.

ఇప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది.మీ ప్రయాణం ధైర్యంగా సాగించండి అంటూ మాధవన్ విద్యార్థులని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

విద్యార్ధులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు