ట్రోలర్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సోనూసూద్!

కరోనా, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

దేశంలో కరోనా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది.

వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది.

కరోనా కష్ట కాలంలో కోట్లల్లో పారితోషికం తీసుకునే స్టార్ హీరోలు సహాయం చేయడానికి ముందుకు రాకపోయినా సోనూసూద్ మాత్రం తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.సినిమాల్లో విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు పేదలకు, వలస జీవులకు, విద్యార్థులకు, రైతులకు సహాయం చేస్తూ గొప్ప మనస్సును చాటుకున్నారు.అయితే అందరికీ సహాయం చేస్తున్న సోనూను ప్రజలంతా ప్రశంసిస్తున్నా కొందరు మాత్రం సోనూను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

చాలా రోజుల నుంచి ట్రోల్స్ విషయంలో మౌనంగా ఉన్న సోనూసూద్ తాజాగా స్పందించి ట్రోలర్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఒక టీవీ షోకు హాజరైన సోనూ తాను చిన్నప్పుడు విన్న కథ గురించి చెప్పారు.

"ఒక సాధువు దగ్గర అద్భుతమైన గుర్రం ఉండేదని.ఒక బందిపోటు సాధువును గుర్రం తనకు ఇవ్వాలని కోరినా సాధువు ఇవ్వలేదని.

ఆ తరువాత సాధువు నడవలేని స్థితిలో వెళుతున్న వృద్ధుడిని చూసి గుర్రాన్ని ఇచ్చాడని.ఆ వృద్ధుడు గుర్రంపై ఎక్కిన తరువాత తాను బందిపోటునని చెప్పాడని.

ఆ తరువాత సాధువు గుర్రంపై వెళుతున్న బందిపోటును ఆపి గుర్రాన్ని తీసుకువెళ్లినా పరవాలేదని.అయితే గుర్రాన్ని ఎలా ఇచ్చాననే విషయం మాత్రం చెప్పొద్దని కోరాడని.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

బందిపోటు ఎందుకు అని సాధువును ప్రశ్నించగా ప్రజలు ఎప్పుడూ మంచి పని చేసేవారిని నమ్మరు" అని చెప్పాడని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు.ట్రోల్స్ తనను ప్రభావితం చేయవని తాను చేయాలనుకున్నది ఖచ్చితంగా చేసి తీరతానని సోనూ అన్నారు.

Advertisement

ఎవరికీ ఊరికే సాయం చేయలేదని సాయం చేసిన వారి పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పారు.తనపై విమర్శలు చేసే బదులు ఇతరులకు సాయం చేస్తే మంచిదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

తాజా వార్తలు