తెలుగులోని టాలెంటెడ్ నటులలో అడివి శేష్ ఒకరని చెప్పవచ్చు.నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.
పంజా, రన్ రాజా రన్, బాహుబలి, క్షణం సినిమాలు అడివి శేష్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.కెరీర్ తొలినాళ్లలో సినిమాల విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న అడివి శేష్ సరైన కథల ఎంపిక ద్వారా సక్సెస్ సాధించారు.

అడివి శేష్ నటించిన మేజర్ మూవీ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది.అయితే తాజాగా ఈ నటుడు పెళ్లి గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో అడివి శేష్ ఒకరు కాగా శుక్రవారం ఈ నటుడి 36వ పుట్టినరోజు కావడం గమనార్హం.ఇన్నేళ్లు సినిమాలకే పరిమితమైన అడివి శేష్ తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తుతానికి తాను వర్క్ ను లవ్ చేస్తున్నానని చెప్పారు.
ఇంట్లో వాళ్లు మ్యారేజ్ గురించి తనను ఎప్పుడో అడిగారని అడివి శేష్ చెప్పుకొచ్చారు.కొన్ని రోజుల తర్వాత పెళ్లి విషయంలో తిట్టారని ఆ తర్వాత లాభం లేదని భావించి తనను వదిలేశారని శేష్ కామెంట్లు చేశారు.
అయితే ఈ మధ్య కాలంలో మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తోందని శేష్ అన్నారు.అడివి శేష్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా త్వరలో ఈ నటుడు శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.