రాజమౌళి నీ హైట్ ఎక్కడ పక్కకు పో అన్నాడు.. అదిరే అభి కామెంట్స్ వైరల్!

సినిమాల ద్వారా, జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో అదిరే అభి ఒకరనే సంగతి తెలిసిందే.

ఒక ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ కెమెరా ముందు ఏం చేసినా బాగుంటుందని కెమెరా వెనుక ఉండి గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలని అదిరే అభి చెప్పుకొచ్చారు.

చిరంజీవి హోస్ట్ గా చేసిన సమయంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కు క్రియేటివ్ డైరెక్టర్ గా పని చేశానని అభి తెలిపారు.చిరంజీవి పెద్ద స్టార్ అయినా అవతలి వ్యక్తి చెప్పే మాటలను వింటారని మనం చేసేది తప్పని తెలిసిన ష్యూరా అని అడుగుతారని అభి అన్నారు.

చిరంజీవి అంటే పిచ్చి అభిమానమని అదిరే అభి పేర్కొన్నారు.చిరంజీవి చాలా జోవియల్ గా ఉంటారని అభి వెల్లడించారు.

రాజమౌళి దగ్గర బాహుబలి2 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని రాజమౌళి టాలీవుడ్ స్టాండర్డ్ ను ఎక్కడికో తీసుకెళ్లాడని అదిరే అభి చెప్పుకొచ్చారు.రాజమౌళిని చూసి క్రియేటివ్ గా వర్క్ నేర్చుకోవచ్చని అదిరే అభి వెల్లడించారు.

Advertisement

రాజమౌళి షాట్ రెడీ చేసుకున్న సమయంలో పొజిషన్స్ ఇవ్వండి అంటే నేను వెళ్లి నిలబడేవాడినని రాజమౌళి నీ హైట్ ఎక్కడ? ప్రభాస్ హైట్ ఎక్కడ? అక్కడినుంచి జరగాలని చెప్పేవారని అదిరే అభి పేర్కొన్నారు.ప్రభాస్ అన్న కూడా నా హైట్ కు వచ్చేస్తావా నువ్వు అని సరదాగా అనేవారని అదిరే అభి వెల్లడించారు.

బాహుబలి2 షూటింగ్ సమయంలో చాలా ఎండలు ఉండేవని కూర్చుందామంటే ప్లేస్ కూడా ఉండేది కాదని అదిరే అభి పేర్కొన్నారు.గ్రీన్ మ్యాట్స్, బ్లూ మ్యాట్స్ గురించి నేర్చుకోవడం కోసం బాహుబలి2 సినిమాకు పని చేశానని అదిరే అభి చెప్పుకొచ్చారు.బాహుబలి2 సినిమాతో బిజీగా ఉంటునే సాఫ్ట్ వేర్ జాబ్, జబర్దస్త్ చేశానని అదిరే అభి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు