రాహుల్ గాంధీపై తీసుకున్న చర్య సరైంది కాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందనడానికి రాహుల్ గాంధీ సంఘటనే ఉదాహరణ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లడుతూ టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ కు ఆపాదించడం దౌర్భాగ్యమన్నారు.

కేటీఆర్ ను టార్గెట్ చేసి తెలంగాణ కాంగ్రెస్,బీజేపీ అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని హితవు పలికారు.

లక్షలాది కోట్ల కుంభకోణాలకు పాల్పడిన అదానీకి మేలు చేకూర్చేలా ఇతరులను అణచి వేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.బీజేపీ రాహుల్ గాంధీ కుటుంబంపై విషం కక్కడం సరికాదన్నారు.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

Latest Nalgonda News