హత్య కేసులో నిందితుంది అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం( Vemulawada ) లోని ఓల్డ్ అర్బన్ కాలనికి చెందిన కోరుకుంట్ల బాబు, కురుకుంట్ల శ్రీధర్, ఓల్డ్ అర్బన్ కాలనికి చెందిన వారు సుమారు గత 3 సం.

క్రితం నుండి స్నేహితులుగా ఉండేవారు.

ఆ సమయంలో బాబు అప్పాచి బండిని కొనుక్కోనగా, ఇద్దరిమద్యన వచ్చిన చిన్న గొడవల కారణంగా కోరుకుంట్ల బాబు యొక్క అప్పాచి బండిని శ్రీధర్ పెట్రోల్ పోసి తగలపెట్టాడు.ఇట్టి విషయం లో శ్రీధర్ తన స్నేహితుడు కోరుకుంట్ల బాబుకి అప్పాచి తగలబెట్టిన విషయంలో లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని, కేవలం రూ.50,000/- మాత్రమే ఇచ్చి, మిగతా డబ్బులు ఇవ్వకుండా, కోరుకుంట్ల బాబుని శ్రీధర్ తన స్నేహితుల ముందు చులకనభావంతో మాట్లాడేవాడు.ఇట్టి విషయంను మనసులో పెట్టుకొని కోరుకుంట్ల బాబు తన స్నేహితుడు అయిన శ్రీధర్ ఫై కక్ష పెంచుకొని, తరుచు గోడవపడుతుండేవాడు.ఈ క్రమం లో కోరుకుంట్ల బాబు బొంబాయి వెళ్ళీ తిరిగి 10 రోజుల క్రితం వేములవాడకు రాగ, కోరుకుంట్ల బాబు ను చూసిన శ్రీధర్, కోరుకుంట్ల బాబు ని కించపరిచే మాటలతో హేళన చేయగా కోరుకుంట్ల బాబు విసిగిపోయి, శ్రీధర్ ని ఎలాగైనా చంపాలి అని ఉద్దేశ్యంతో సమయం కోసం వేచి చూసి, తేది 11.02.2024 రోజున రాత్రి అందాద 10.45 గం.లకు కోరుకుంట్ల బాబు శ్రీధర్ ఇంటికి వెళ్లి, శ్రీధర్ ను బయటకు రమ్మని శ్రీధర్ యొక్క ఎచ్ ఎఫ్ డీలక్స్ బైక్( HF Deluxe Bike ) బి .నెం .టిఎస్ 23 ఏ 3546 గల దాని మీద ఇంటి నుండి తీసుకు వెళ్లి 2 వ బైపాస్ పక్కనగల ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ పక్కన గల కాళీ స్థలంలోకి తీసుకువెళ్లి, రాత్రి అందాదా 11.00 గం.సమయంలో శ్రీధర్ కి బాగా మద్యం తాగించి, తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతును కోసి హత్య చేసి, శ్రీధర్ బండి( Shridhar Bandi )ని ఎత్తుకుపోయి, తప్పించుకు తిరుగుతున్న కోరుకుంట్ల బాబు ను ఈ రోజు పోలీస్ వారు నమ్మదగిన సమాచారం తో శివపార్వతుల కాలని పక్కన గల నిర్మాణం లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పట్టుకొని, రిమాండ్ కు తరలిస్తున్నట్టు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు.t.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News