తిరుపతి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా సంస్థ.. !

ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల మీద వివిధ సర్వే సంస్దలు వారు చేసిన సర్వే తాలుకూ వివరాలు వెల్లడించడం సర్వసాధారణంగా మారింది.

అంతే కాకుండా అధికారంలో ఉన్న వారు తామే తప్పక గెలుస్తామనే ధీమాతో ఉండటం కూడా తెలిసిందే.

ఇకపోతే ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.

కానీ అప్పటి వరకు ఎందుకని తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ఆరా సంస్థ వెల్లడించింది.కాగా ఈ ఎన్నికలో బీజేపీ జనసేన కూటమికి 7.34 శాతం, టీడీపీకి 23.10, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని, అత్యధికంగా వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా అంచనా వేసింది.ఇకపోతే నేడు పశ్చిమ బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగియడంతో దేశవ్యాప్త ఎన్నికల కోలాహలం ముగిసింది.

ఈ నేపథ్యంలో, గెలుపు ఓటముల పై ఆసక్తి నెలొకొన్న క్రమంలో ఈ ఎగ్జిట్ పోల్స్ నేతలకు కాస్త ఊరటనిస్తున్నాయి.

Advertisement
జగన్ వర్సెస్ షర్మిల : విజయమ్మ తీరుపై వైసిపి అనేక ప్రశ్నలు 

తాజా వార్తలు