రవికృష్ణ, నవ్యస్వామి కలిసి ఫ్లాట్ కొన్నారన్న సుమ.. నిజమేనా..?

బుల్లితెరపై పలు టీవీ సీరియళ్ళలో కొన్ని జోడీలు ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంటాయి.అలాంటి జోడిలలో రవి కృష్ణ, నవ్య సామి ఒకరని చెప్పవచ్చు.

వీరిద్దరు హీరో హీరోయిన్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఆమె కథ సీరియల్ లో ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సీరియల్ ద్వారా ఇద్దరు ఎంతో అందమైన జోడిగా పేరును సంపాదించుకున్నారు.

అదే విధంగా పలు టీవీ కార్యక్రమాలలో ఇద్దరు జంటగా హాజరయ్యి ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు.వీరిద్దరు ఎంతో చనువుగా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం సాగుతోందని ప్రేక్షకులు భావించారు.

తాజాగా ఈ జోడి ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరి పెళ్లి హడావిడి జరిగింది.దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుమానం మరింత బలం అయింది.

Advertisement

అయితే వీరిద్దరి గురించి వస్తున్న పలు రూమర్ల పై నవ్య స్వామి ఘాటుగా స్పందించారు.మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ప్రయాణాలు లేవని తేల్చి చెప్పారు.

మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ నవ్య స్వామి చెప్పుకొచ్చారు.

సాధారణంగా నాపై వచ్చే ఇలాంటి రూమర్లను పెద్దగా పట్టించుకోనని నావల్ల నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం వల్ల ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.మేమేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే ఈ విధంగా సీరియస్ గా తీసుకుంటే దానికి ఎవరు బాధ్యులు కారని నవ్య స్వామి తెలిపారు.తాజాగా ఈ జోడి సుమ కనకాల వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న స్టార్ మ్యూజిక్ షోకు వచ్చారు.

ఇందులో ర‌వికృష్ణ‌- న‌వ్య‌- ఐశ్వ‌ర్య పిస్సె ఒక టీమ్‌గా, అర్జున్‌- సుహాసిని- వైష్ణ‌వి రామిరెడ్డి మ‌రో టీమ్‌గా పాల్గొన్నారు.ఈ షోలో సుమ నవ్య స్వామి రవికృష్ణ నుద్దేశించి మీ ఇద్దరి మధ్య ఏమో జరుగుతుంది అని అడగగా, అందుకు నవ్య స్వామి మా ఇద్దరి మధ్య ఏంలేదని తెలియజేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అదేవిధంగా మీ ఇద్దరూ కలిసి ఫ్లాట్ కొన్నారట కదా.అని సుమ అడగగా అందుకు రవి కృష్ణ రేయ్ ఎవరురా అలా అన్నది అన్నాడు.స్టార్ మ్యూజిక్ షో లో ఈ రెండు టీమ్ లు కలిసి చేసిన సందడి చూడాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement

ప్రస్తుతం ఈ షోకి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు.ఇంకెందుకాలస్యం ఆ ప్రోమో మీరు చూసేయండి.

తాజా వార్తలు