చిన్నారిని బొమ్మలా గాల్లో ఎగిరేసిన అడవి దున్న.. షాకింగ్ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక చిన్నారిపై ఒక భారీ అమెరికన్ అడవి దున్న ( Bison ) హింసాత్మకంగా దాడి చేసింది.

ఈ సంఘటన చూసి షాక్ అవడం అందరి వంతు అయింది.దీనికి సంబంధించి టెర్రిఫైయింగ్ నేచర్ ( Terrifying nature )అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ గానూ మారింది.

ఈ వీడియో పదుల సంఖ్యలో ప్రజలు తిరుగుతున్న ప్రాంతంలో ఆ దున్నపోతు శాంతియుతంగా మేస్తున్నట్లు చూపిస్తుంది.

వీడియోలో కనిపించినట్లుగా.అలా మేస్తూనే అది అకస్మాత్తుగా పైకి చూసి, ముందుకు దూసుకుపోతుంది.కళ్ళు మూసి తెరిచేలోగా ఆ భారీ దున్నపోతు తన తలతో ఒక చిన్నారిని గాలిలోకి చాలా అడుగుల దూరం విసిరింది.

Advertisement

ఇది చూసి అక్కడే ఉన్న కొంతమంది చిన్నారులు భయంతో పరుగులు తీశారు.ఈ వీడియో క్లిప్‌ను "బైసన్ అటాక్స్ చైల్డ్" ( Bison Attacks Child )అనే టైటిల్‌తో ట్విట్టర్ పేజీ టెర్రిఫైయింగ్ నేచర్ షేర్ చేసింది.

వీడియో చూస్తుంటే ఆ చిన్నారికి తీవ్ర గాయాలు తగిలినట్లు స్పష్టమవుతుంది.ఈ శారీరక గాయాలే కాకుండా ఆ బాలిక ఈ ఎటాక్ వల్ల మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది.

ముఖ్యంగా ఆమెలో భయం విపరీతంగా పెరిగి ఉంటుంది.

బైసన్ అనేది చాలా దూకుడుగా ఉండే ఒక అడవి జంతువు దీనిని ఎవరూ కూడా పెంచరు.ఎక్కువగా ఉత్తర అమెరికాలో( North America ) కనిపించే ఈ బర్రెలను కొన్ని సందర్భాలలో బంధిస్తారు.అనూహ్య ప్రవర్తన కలిగిన వీటికి దగ్గరలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను వీటి దగ్గరకు అసలు పంపించకూడదు.

Advertisement

తాజా వార్తలు