ఒంటరి వికలాంగ మహిళ దారుణ హత్య

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం జాటోత్ తండాకు చెందిన వికలాంగురాలిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి పరిశీలించి,డాగ్ స్క్వాడ్ ను రప్పించి క్లూస్ సేకరించి,కేసు నమోదు చేసుకొని,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఒంటరిగా ఉంటున్న వికలాంగ మహిళను దారుణంగా హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ సందర్భంగా సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం.

జాటోత్ తండాలో ధరావత్ రమణ (40) అనే వికలాంగ మహిళ గత పదేళ్లుగా ఒంటరిగా జీవిస్తుందని,రోజూ లాగే శుక్రవారం రాత్రి కూడా ఇంట్లోనే పడుకోగా హత్య గురైనట్లు తెలుస్తుందన్నారు.కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామని,గుర్తు తెలియని వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు.

త్వరలోనే హత్యకు గల కారణాలు,నిందితులు ఎవరనేది గుర్తిస్తామని చెప్పారు.

Advertisement
అధ్యక్ష పీఠం రక్షణ కవచం .. ఆ కేసు నుంచి ట్రంప్‌ తప్పించుకున్నట్లేనా?

Latest Suryapet News