వీడియో: దత్తత తీసుకోమని దీనంగా అడిగిన పిల్లి.. తర్వాతేమైందో చూస్తే..

సాధారణంగా వీధుల్లో బతికే కుక్కలు, పిల్లులు ఆశ్రయం, ఆహారం, ప్రేమ నోచుకోలేక నరకం అనుభవిస్తాయి.

అయితే కొన్ని కుక్కలు లేదా పిల్లలు మాత్రం యజమానులను వాటంతటవే వెతుక్కుంటాయి.

తాజాగా ఒక పిల్లి( Cat ) కూడా దత్తత తీసుకోమని మ్యాట్ రామ్‌సీ( Matt Ramsey ) అనే ఒక ఉద్యోగిని అడిగింది.అనుకోకుండా ఈ వీధి పిల్లిని కలిసిన సంఘటన గురించి సదరు ఉద్యోగి ట్విట్టర్‌లో తెలియజేశాడు.

ఒక ట్వీట్ థ్రెడ్ స్టార్ట్ చేసి ఆ క్యాట్‌ గురించి తెలిపాడు.ఇప్పుడు వారిద్దరి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ట్వీట్ ప్రకారం, ఆఫీస్ ముందు మామూలుగా మ్యాట్ నడుస్తుండగా ఒక చిన్న పిల్లి అతని చుట్టూ తిరుగుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది.ఆ పిల్లి అతనిని ముద్దాడడం, కళ్లతో చూడడం, అతని కాళ్ళ మీదకు ఎక్కడానికి ప్రయత్నించడం చేసింది.

Advertisement

ఈ అద్భుతమైన క్షణాన్ని కెమెరాలో బంధించి, మ్యాట్ ఆ వీడియాను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు."ఇది ఇప్పుడే నా ఆఫీస్ ముందు కనిపించింది.

నాకు ఏం చేయాలో తెలియడం లేదు." అని రాసుకొచ్చాడు.

తర్వాత ట్వీట్‌లో పిల్లి తాను సిద్ధం చేసిన పెట్టెలో పడుకోకుండా, తన మీదే నిద్రపోయిందని మ్యాట్ రాశాడు."అది బాగా నిద్రపోతుంది.పెట్టెలో పెద్దగా నిద్రపోదు, కానీ నా ఛాతీ మీద బాగా పడుకుంటుంది.

" అని ఆయన అన్నాడు.ఈ పిల్లికి ఎగ్స్ వంటి ఆహారం ఇచ్చిన దృశ్యాలను కూడా మ్యాట్ రికార్డ్ చేశాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

అతను తన కుక్క స్పైక్‌కి( Spike ) ఆ పిల్లిని పరిచయం చేశాడు."ఈ క్యాట్ అరవదు లేదా కొరకదు.

Advertisement

కానీ చాలా ఎక్కువగా నాకుతుంది.ఇప్పుడు నేను బాత్‌టబ్‌లో కూర్చున్నా.

పిల్లి బాత్‌టబ్‌లోకి రాదు కాబట్టి దాన్నుంచి ఈ సమయంలో నేను విముక్తి పొందా," అని మ్యాట్ ఫన్నీగా తన మరో ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు.

మ్యాట్ ఆ పిల్లితో చాలా ఆడుకున్నాక దానిని డాక్టర్‌కు చూపించాలని నిర్ణయించుకున్నాడు.ఆ పిల్లికి దాదాపు రెండు నెలల వయసు ఉంటుందని, దాని చెవుల్లో ఇన్ఫెక్షన్( Ear Infection ) ఉందని డాక్టర్ చెప్పారు తర్వాత దానికి మందులు ఇచ్చారు.పిల్లిని ఎలా చూసుకోవాలో డాక్టర్ మ్యాట్‌కి వివరించారు.

మ్యాట్ బయటకు వెళ్లి ఆ పిల్లికి ఆడుకునే బొమ్మలు, తినడానికి ఆహారం, నీళ్లు తాగడానికి పాత్రలు కొన్నాడు.కొన్ని రకాల స్పెషల్ ఫుడ్స్‌ కూడా కొన్నాడు.

కానీ ఆ తర్వాత మ్యాట్ పనికి వెళ్ళాడు.తను ఆ పిల్లిని ఎలా చూసుకుంటున్నాడో రేపు ఫోటోలు పెడతానని చెప్పాడు.

ఈ వ్యక్తి ఒక వీధి పిల్లిని తన ఇంటికి తీసుకువెళ్లి ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోవడం చూసి చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఆయన ట్వీట్స్‌కు కోటి దాకా వ్యూస్ వచ్చాయి.

తాజా వార్తలు